Share News

Railway Bill: రైల్వే సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

ABN , Publish Date - Dec 11 , 2024 | 07:37 PM

బిల్లుపై చర్చ సందర్భంగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, రైల్వేలను ప్రైవేటుపరం చేసే ఆలోచన ప్రభుత్వ ఎజెండాలో లేదని వివరించారు. బిల్లు సవరణతో రైల్వేలు ప్రైవేటుపరం అవుతాయంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను కొట్టివేశారు.

Railway Bill: రైల్వే సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

న్యూఢిల్లీ: రైల్వే బోర్డు పనితీరును మెరుగుపరచేందుకు ఉద్దేశించిన రైల్వే (సవరణ) బిల్లు-2024కు లోక్‌సభ (Lok Sabha) బుధవారంనాడు ఆమోదం తెలిపింది. ఈ బిల్లు సుదీర్ఘ చర్చ అనంతరం మూజువాణి ఓటుతో సభామోదం పొందింది. బిల్లుపై చర్చ సందర్భంగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnaw) మాట్లాడుతూ, రైల్వేలను ప్రైవేటుపరం చేసే ఆలోచన ప్రభుత్వ ఎజెండాలో లేదని వివరించారు. బిల్లు సవరణతో రైల్వేలు ప్రైవేటుపరం అవుతాయంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను కొట్టివేశారు. ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారంతో ప్రజలను తప్పుదారి పట్టించవద్దని కోరారు. రైల్వే రంగాన్ని మరింత మెరుగుపరచడానికి, బోర్డు స్వతంత్రతను పెంపొందించేందుకు రైల్వే సవరణ బిల్లు తెచ్చామని చెప్పారు.

Mallikarjun Kharge: ధన్‌ఖడ్‌ ప్రభుత్వ ప్రతినిధి, ప్రజాస్వామ్య పరిరక్షణకే అవిశ్వాసం: ఖర్గే


''కొద్ది మంది సభ్యులు తాజా సవరణ బిల్లుతో రైల్వేలు ప్రైవేటుపరం అవుతాయని చెబుతున్నారు. ఇది తప్పుదారి పట్టించే ప్రయత్నమే. దయచేసి అలాంటివి చేయవద్దని కోరుతున్నాను. రాజ్యాంగం విషయంలోనూ ఇలాంటి తప్పుడు అభియోగాలు చేసి విఫలమయ్యారు'' అని అశ్విన్ వైష్ణవ్ అన్నారు. రైల్వేలను ఆధునీకరించడం, పటిష్టం చేయడం ప్రభుత్వ ఉద్దేశమని, రైల్వేల భద్రతపై ఎలాంటి రాజీ ఉండదని చెప్పారు. రైల్వే ట్రాక్, రైళ్లు, లెవెల్ క్రాసింగ్‌ను మరింత మెరుగుపరచడంతో పాటు ట్రాక్ సమస్యలపై నూతన టెక్నాలజీ ఉపయోగిస్తున్నామని చెప్పారు.


రైల్వే సవరణ బిల్లుతో రైల్వే బోర్డు మరిన్ని స్వతంత్ర నిర్ణయాలు తీసుకోగలుగుతుందని, ఓవరాల్ ఎఫిషియన్స్, రెస్పాన్సివ్‌నెస్ మెరుగపరచేందుకు అవసరమైన చర్యలు తీసుకునే వీలుంటుందని మంత్రి చెప్పారు. గ్లోబల్ ప్రమాణాలతో అద్భుతమైన సేవలు అందించగలుగుతుందని అశ్విని వైష్ణవ్ తెలిపారు.


ఇవి కూడా చదవండి..

Parliament: పార్లమెంట్ సమావేశాలు.. నోటీసులు ఇచ్చిన ఎంపీలు..

CM Stalin: అదానీతో భేటీ అవాస్తవం.. ఆ గ్రూపుతో ఒప్పందాల్లేవ్‌..

For National news And Telugu News

Updated Date - Dec 11 , 2024 | 07:37 PM