Arvind Kejriwal: ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్‌కు దక్కని ఊరట.. ఈడీకి నోటీసులు
ABN , Publish Date - Mar 27 , 2024 | 07:28 PM
లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించలేదు. తన అరెస్ట్‌ను, ఈడీ కస్టడీకి పంపుతూ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ.. ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
లిక్కర్ స్కామ్‌కు (Delhi Liquor Scam) సంబంధించిన మనీలాండరింగ్ కేసులో (Money Laundering Case) అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు (Arvind Kejriwal) ఢిల్లీ హైకోర్టులో (Delhi High Court) ఊరట లభించలేదు. తన అరెస్ట్‌ను, ఈడీ కస్టడీకి పంపుతూ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ.. ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తనను అక్రమంగా ఈడీ అరెస్ట్ చేసిందని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. బుధవారం ఈ పిటిషన్‌ను న్యాయస్థానం విచారించింది. అయితే.. తనకు ఉపశమనం లభించవచ్చని ఆశించిన కేజ్రీవాల్‌కు నిరాశే ఎదురైంది. ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. అందుకు బదులుగా.. ఈడీకి న్యాయస్థానం ఒక నోటీసు జారీ చేసింది. కేజ్రీవాల్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేసేందుకు గాను ఏప్రిల్ 2వ తేదీ వరకు ఈడీకి కోర్టు సమయం ఇచ్చింది. దీంతో.. కేజ్రీవాల్ ప్రస్తుతానికి జైలులోనే ఉండాల్సి ఉంటుంది.
Sunita Kejriwal: ఢిల్లీలో బిహార్ సీన్ రిపీట్.. కేజ్రీవాల్ సీఎం కుర్చీలో భార్య!
కాగా.. విచారణ సమయంలో ఇరువర్గాలకు చెందిన న్యాయవాదుల మధ్య వాడీవేడీగా వాదనలు కొనసాగాయి. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత సిట్టింగ్ సీఎంను అరెస్ట్ చేయడం సరికాదని కేజ్రీవాల్ తరపున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ (Abhishek Manu Singhvi) కోర్టుకు తెలిపారు. కేజ్రీవాల్‌ను వెంటనే ఈడీ కస్టడీ నుంచి రిలీజ్ చేయాలని కోరారు. కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీని నిర్వీర్యం చేసే ఉద్దేశంతోనే ఈడీ అరెస్ట్ జరిగినట్లు ఆయన కోర్టు ముందు ప్రస్తావించారు. పీఎంఎల్‌ఏ సెక్షన్ 50 ప్రకారం కేజ్రీవాల్ స్టేట్‌మెంట్ రికార్డు చేయలేదని అన్నారు. కేజ్రీవాల్ ప్రాథమిక మానవ హక్కులను ఈడీ ఉల్లంఘించిందని, నేరాన్ని నిర్ధారించడంలో ఈడీ విఫలమైందని పేర్కొన్నారు. కేజ్రీవాల్ ఈడీ అరెస్ట్ రాజకీయ పరమైందని ఆరోపించారు. అటు.. ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు తమ వాదనలు వినిపించారు. ఇరువర్గాల వాదనలు విన్నాక.. ఢిల్లీ హైకోర్టు పైవిధంగా స్పందించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి