Share News

Delhi: ఈ నగరానికి ఏమైంది.. ఓ వైపు కాలుష్యం.. మరోవైపు పొగమంచు..

ABN , Publish Date - Jan 05 , 2024 | 01:19 PM

న్యూఢిల్లీ.. ఈ పేరు చెబితే చాలు.. పొగలా కమ్ముకున్న కాలుష్యం కళ్లముందు కదలాడుతుంది. వాటిని తగ్గించేందుకు వాటర్ స్ప్రే చేసే వాహనాలు గుర్తుకువస్తాయి.

Delhi: ఈ నగరానికి ఏమైంది.. ఓ వైపు కాలుష్యం.. మరోవైపు పొగమంచు..

న్యూఢిల్లీ.. ఈ పేరు చెబితే చాలు.. పొగలా కమ్ముకున్న కాలుష్యం కళ్లముందు కదలాడుతుంది. వాటిని తగ్గించేందుకు వాటర్ స్ప్రే చేసే వాహనాలు గుర్తుకువస్తాయి. ఇప్పటికే కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న దేశ రాజధాని ఇప్పుడు చలి, పొగమంచు కోరల్లో చిక్కుకుని గజగజ వణుకుతోంది. ఉష్ణోగ్రతలు కనిష్ఠానికి పడిపోవడంతో దిల్లీ-ఎన్‌సీఆర్‌లో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. రాజధాని ప్రజలు తీవ్రమైన చలి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు, ఉష్ణోగ్రతలు 6 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గాయని సఫ్దర్‌జంగ్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

పొగమంచు కారణంగా వివిధ ప్రాంతాల నుంచి దిల్లీకి రావాల్సిన 22 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని రైల్వే అధికారులు వెల్లడించారు. పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఉత్తరప్రదేశ్, తూర్పు రాజస్థాన్ లో మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. దిల్లీలోని అత్యధిక ఉష్ణోగ్రత 12.5 డిగ్రీలు కాగా అత్యల్ప ఉష్ణోగ్రత 6.8 డిగ్రీలుగా ఉంది.

తేమతో కూడిన నైరుతి గాలుల ప్రభావంతో ఆదివారం నుంచి కనిష్ఠ, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2-4 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, దక్షిణ హర్యానా, దక్షిణ ఉత్తర ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలలో వచ్చే వారం ప్రారంభంలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి.

"మరిన్ని వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి."

Updated Date - Jan 05 , 2024 | 04:58 PM