Audi Car Owner: ఆడి కారు ఓనర్ ఓవరాక్షన్
ABN , Publish Date - Aug 31 , 2024 | 02:06 PM
ముంబై ఘట్ కోపర్ మాల్‌కు ఎదురుగా ఉన్న బిల్డింగ్ ప్రవేశ ద్వారం వద్ద ఆడి కారు వెళుతోంది. వెనకాల ఓలా కారు వస్తోంది. ఆడి కారు ఆగడంతో.. క్యాబ్ డ్రైవర్ బ్రేక్ వేశాడు. ఆడి కారు బంపర్‌కు కొంచెం తాకింది. కారులో ఉన్న ఓనర్ రిషబ్ చక్రవరి, అతని భార్యకు ఎక్కడా లేని కోపం వచ్చింది. వారిద్దరు కారును ఆపి, దిగేశారు.
నగరాల్లో ముందు వెళ్లే వాహనానికి కారు తగలడం కామన్. రద్దీగా ఉండే ప్రాంతంలో వెహికిల్ కంట్రోల్ కాదు. కొన్ని సందర్భాల్లో తగులుతుంటాయి. ఒక్కొసారి మనం కూడా అదే తప్పు చేస్తాం అని పెద్ద మనస్సు చేసుకోవాలి. కొందరు కాస్ట్లీ కారు ఓనర్లు మాత్రం ఓవర్ యాక్షన్ చేస్తుంటారు. కారుకి మరో వాహనం తగిలితే చాలు రెచ్చిపోతారు. ఆ జాబితాలో ముంబైకి చెందిన రిషబ్ చక్రవర్తి ఉంటారు.
ఏం జరిగిందంటే..
ముంబై ఘట్ కోపర్ మాల్‌కు ఎదురుగా ఉన్న బిల్డింగ్ ప్రవేశ ద్వారం వద్ద ఆడి కారు వెళుతోంది. వెనకాల ఓలా కారు వస్తోంది. ఆడి కారు ఆగడంతో.. క్యాబ్ డ్రైవర్ బ్రేక్ వేశాడు. ఆడి కారు బంపర్‌కు కొంచెం తాకింది. కారులో ఉన్న ఓనర్ రిషబ్ చక్రవరి, అతని భార్యకు ఎక్కడా లేని కోపం వచ్చింది. వారిద్దరు కారును ఆపి, దిగేశారు.
దూషించి, కొట్టి, తన్ని.. కిందపడేసి
కారు దిగిన వెంటనే ఓలా క్యాబ్ డ్రైవర్ కయముద్దీన్‌ను దూషించడం ప్రారంభించారు. ఓలా డ్రైవర్ వద్దకు రిషబ్ చక్రవరి వెళ్లాడు. కారు నుంచి దిగిన డ్రైవర్‌పై పిడి గుద్దుల వర్షం కురిపించాడు. అతనిని పైకి లేపి కింద పడవేశాడు. పై నుంచి పడటంతో కయముద్దీన్ కాసేపు అచేతనంగా ఉండిపోయారు. అయినప్పటికీ కరుణించలేదు. కాలితో తన్ని పైశాచిక ఆనందం పొందాడు. రిషబ్ దాడి చేస్తోన్నప్పటికీ అక్కడికి వచ్చినవారు ఆపలేదు. అక్కడే ఉండి చూస్తుండి పోయారు. కాసేపటికి కయముద్దీన్ పైకి లేచి, తల పట్టుకొని కనిపించారు.
ఉపా కింద కేసు
ఘటన ఈ నెల 18వ తేదీన జరిగినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కయముద్దీన్ తొలుత రాజావడి ఆస్పత్రికి తర్వాత జేజే ఆస్పత్రికి తరలించారు. ఆ రోజు ఏం జరిగిందో తెలియజేయాలని పోలీసులు స్టేట్ మెంట్ తీసుకున్నారు. ఏం జరిగింది చెప్పడంతో రిషబ్, అతని భార్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. రిషబ్ తీరును నెటిజన్లు ఖండించారు. దురుసుగా ప్రవర్తించిన ఆడి కారు ఓనర్‌పై ఉపా లాంటి కఠిన చట్టం కింద కేసు నమోదు చేయాలని కోరారు. ఓ బలహీన వ్యక్తిపై దాడి చేసి, తాము బలవంతులం అని చెప్పేందుకు సమాజంలో కొందరు ప్రయత్నిస్తున్నారని మరొ యూజర్ మండిపడ్డారు.
For Latest News click here