Share News

Lok Sabha:నీట్ పేపర్ లీకేజీపై చర్చకు లోక్‌సభలో విపక్షాల పట్టు..

ABN , Publish Date - Jul 01 , 2024 | 11:49 AM

రెండు రోజుల విరామం తర్వాత పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈనెల 24వ తేదీన లోక్‌సభ సమావేశాలు ప్రారంభం కాగా.. మొదటి రెండు రోజులు ఎంపీల ప్రమాణ స్వీకారం జరిగింది. మూడో రోజు స్పీకర్ ఎన్నిక జరిగింది.

Lok Sabha:నీట్ పేపర్ లీకేజీపై చర్చకు లోక్‌సభలో విపక్షాల పట్టు..
Lok Sabha

రెండు రోజుల విరామం తర్వాత పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈనెల 24వ తేదీన లోక్‌సభ సమావేశాలు ప్రారంభం కాగా.. మొదటి రెండు రోజులు ఎంపీల ప్రమాణ స్వీకారం జరిగింది. మూడో రోజు స్పీకర్ ఎన్నిక జరిగింది. 27వ తేదీన రాష్ట్రపతి ప్రంసంగించారు. ఈరోజు సభ ప్రారంభం కాగానే నీట్‌ పేపర్ లీకేజీపై లోక్‌సభలో చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. విపక్షాల నిరసన మధ్య సభ కొనసాగుతోంది. మొదట వివిధ కమిటీల నియామకాలకు సంబంధించిన ప్రతిపాదనలను పార్లమెంటరీ వ్యవహరాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు సభ ముందుంచారు. ఆ తర్వాత రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు స్పీకర్ ఓంబిర్లా అనుమతించారు. బీజేపీ హమీర్‌పుర్ ఎంపీ అనురాగ్ ఠాకూర్ చర్చను ప్రారంభించారు. మోదీ నాయకత్వంపై విశ్వాసంతో దేశ ప్రజలు వరుసగా మూడోసారి ఎన్డీయేను గెలిపించారన్నారు. ప్రపంచం మెచ్చిన నాయకుడు ప్రధాని మోదీ అంటూ ప్రశంసించారు. దేశం నుంచి పేదరికాన్ని తరిమికొడతామని కాంగ్రెస్ దశాబ్ధాలుగా నినాదాలు ఇస్తోందని.. మోదీ ప్రభుత్వం పేదరికాన్ని తరిమివేసేందుకు పనిచేస్తోందన్నారు.

Delhi : స్వదేశీ చిప్‌తో ఆర్మీ కోసం మొబైల్‌ బేస్‌ స్టేషన్‌


సభలో రాహుల్ vs రాజ్‌నాధ్..

నీట్ పేపర్ లీకేజీతో ఎంతో మంది వైద్య విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఒకరోజు పేపర్ లీకేజీపై లోక్‌సభలో చర్చించాలని ఆయన స్పీకర్‌ను కోరారు. నీట్ అంశాన్ని ప్రస్తావించడానికి అనేక మార్గాలు ఉన్నాయని.. ఆ సందర్భంగా ప్రస్తావించాలని.. ప్రస్తుతం రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చించాలని సభ నిర్ణయించిందని స్పీకర్ ఓంబిర్లా తెలిపారు. పేపర్ లీకేజీపై యువత ఆందోళనతో ఉన్నారని.. పార్లమెంట్ వేదికగా దేశం మొత్తానికి ఒక సందేశం ఇవ్వాల్సిన అవసరం ఉందని.. పూర్తిగా ఒకరోజు నీట్ పేపర్ లీకేజీపై చర్చించాలని మరోసారి రాహుల్ గాంధీ స్పీకర్‌ను కోరారు. ఆ అంశంపై నోటీసు ఇవ్వాలని.. బీఎసీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఓంబిర్లా తెలిపారు. విపక్షాలు కోరుతున్న అంశాలపై చర్చించేందుకు కేంద్రప్రభుత్వం సిద్ధంగా ఉందని.. అయితే సభకు కొన్ని నియమాలు, నిబంధనలు, సంప్రదాయాలు ఉంటాయన్నారు. ఎప్పుడు ఏ అంశం చర్చించాలనేదానిపై స్పీకర్ నిర్ణయం తీసుకోవల్సి ఉంటుందన్నారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రస్తుతం చర్చను కొనసాగించాలని రాజ్‌నాధ్ కోరారు.


దేశంలో 1,04,561 రకాల జంతుజాతులు

మరిన్ని జాతీయ వార్తల కోెసం ఇక్కడ క్లిక్ చేయండి..

For More National News and Latest Telugu News click here

Updated Date - Jul 01 , 2024 | 12:26 PM