Share News

Viral News: డాక్టర్‌పై కత్తితో దాడి చేసిన రోగి బంధువు.. తర్వాత ఏమైందంటే..

ABN , Publish Date - Nov 14 , 2024 | 12:09 PM

ఓ ఆస్పత్రిలో ఓ యువకుడు వైద్యుడిపై కత్తితో దాడి చేశాడు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అయితే ఆ యవకుడు ఎందుకు దాడి చేశాడనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Viral News: డాక్టర్‌పై కత్తితో దాడి చేసిన రోగి బంధువు.. తర్వాత ఏమైందంటే..
viral news

చెన్నైలోని (chennai) ఓ ఆస్పత్రిలో డ్యూటీలో ఉన్న ఆంకాలజిస్ట్‌పై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. రోగి బంధువు దాడి చేయడం ప్రస్తుతం కలకలం రేపుతోంది. గిండీ కలైంజర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో క్యాన్సర్‌ విభాగంలో పనిచేస్తున్న డాక్టర్‌ బాలాజీ జగన్నాథన్‌ (Dr. Balaji Jagannathan)పై ఈ దాడి జరిగింది. క్యాన్సర్‌ విభాగంలో ఆరునెలల పాటు చికిత్స పొందుతున్న కాంచన అనే రోగి కుమారుడు విఘ్నేష్‌ తల్లికి సరైన వైద్యం చేయలేదని ఆరోపిస్తూ వైద్యుడిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. బుధవారం ఉదయం జరిగిన ఈ సంఘటన కలకలం రేపుతోంది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వెలుగులోకి రావడంతో ఇది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.


క్యాన్సర్‌తో బాధపడుతూ చికిత్స పొందుతున్న విఘ్నేష్‌ తల్లిని కలిసేందుకు విఘ్నేష్‌, ఆయన ముగ్గురు స్నేహితులు ఉదయం ప్రాంతంలో ఆస్పత్రికి చేరుకున్నారు. లోపలికి వెళ్లిన తర్వాత మహిళ పరిస్థితి విషమించడంపై డాక్టర్ జగన్నాథ్‌తో తీవ్ర వాగ్వాదం జరిగినట్లు తెలిసింది. ఈ సందర్భంగా విఘ్నేష్ వైద్యుడిపై ఎటాక్ చేశాడు. ఆసుపత్రిలో తన తల్లికి ఆరు రౌండ్ల కీమోథెరపీ చేయించారని దాడి చేసిన వ్యక్తి పేర్కొన్నట్లు ఓ అధికారి తెలిపారు. మరోవైపు తనపై ప్రేమ, అభిమానంతోనే కొడుకు విఘ్నేష్‌ డాక్టర్‌పై దాడికి పాల్పడ్డారని దాడి చేసిన వ్యక్తి తల్లి మీడియాతో చెప్పారు.


అయితే దాడి జరిగిన వెంటనే రికార్డు చేసిన వీడియోలో నిందితుడిని విఘ్నేష్‌గా గుర్తించారు. అతను ఆసుపత్రిలో తిరుగుతున్నాడు. అతను చంపడానికి ఉపయోగించిన కత్తిని విసిరివేస్తూ కనిపించాడు. ఆ క్రమంలో విఘ్నేష్‌ను ఆసుపత్రి సిబ్బంది తీవ్రంగా కొట్టి పోలీసులకు అప్పగించారు. ఆస్పత్రిలోని ఓపీడీలో ఈ ఘటన జరిగింది. తన తల్లికి వైద్యుడు తప్పుడు మందు ఇచ్చారనే అనుమానంతో విఘ్నేష్‌ మనస్తాపానికి గురయ్యాడని చెబుతున్నారు. ఆయన తల్లి క్యాన్సర్ రోగి, డాక్టర్ జగన్నాథన్ సంరక్షణలో ఉంది. విఘ్నేష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు దాడి వెనుక గల కారణాలపై విచారణ జరుపుతున్నారు. మరోవైపు వైద్యుడు చికిత్స పొందుతున్నాడని, ఆయన అతని పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు.


ఈ ఘటనపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ట్విట్టర్ వేదికగా స్పందించారు. దీనిపై విచారణకు ఆదేశించామని, ఇకపై ఇలాంటి దాడి జరగదని హామీ ఇచ్చారు. వైద్యుల సేవ అభినందనీయమని, వారి భద్రతకు భరోసా ఇవ్వడం మన బాధ్యత అని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ట్విట్టర్‌ వేదికగా పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కత్తిపోట్లకు గురైన డాక్టర్‌ బాలాజీ, ఆయన కుటుంబీకులను ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి పరామర్శించారు.


గిండి ఆస్పత్రికి వెళ్ళి అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్న బాలాజీ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. అక్కడే ఉన్న బాలాజీ తల్లి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆ తర్వాత ఆసుపత్రి వెలుపల ఉదయనిధి మీడియాతో మాట్లాడుతూ డాక్టర్‌ బాలాజీ తలపై 4 చోట్లా, భుజంపైనా, చెవి వద్ద కత్తిపోటు గాయాలయ్యాయని, వైద్యులు ఆయనకు మెరుగైన చికిత్సలందిస్తున్నారని తెలిపారు. ఈ సంఘటనకు నిరసన సమ్మెపిలుపునిచ్చిన వైద్యుల సంఘాల నేతలతో ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం చర్చలు జరుపుతారని తెలిపారు.


ఇవి కూడా చదవండి:

Viral News: పోలీసులపై రాళ్ల దాడి, ఓ వాహనం దగ్ధం.. 100 మందికి పైగా అరెస్టు


Childrens Day 2024: బాలల దినోత్సవం సందర్భంగా మీ పిల్లల స్క్రీన్ టైం ఇలా తగ్గించండి.. ఇవి కూడా నేర్పించండి..


Childrens Day 2024: చిల్డ్రన్స్ డే స్పెషల్.. మీ పిల్లలను ఇలా సర్ ప్రైజ్ చేయండి..


Vegetable Prices: షాకింగ్.. త్వరలో పెరగనున్న కూరగాయల ధరలు, కారణమిదేనా...

Credit Card New Rules: క్రెడిట్ కార్డ్ యూజర్లకు అలర్ట్.. నవంబర్ 15 నుంచి కొత్త రూల్స్..

Read More National News and Latest Telugu News

Updated Date - Nov 14 , 2024 | 12:11 PM