Share News

PM Kisan 18th Installment: రైతులకు అలర్ట్.. ఆ నిధులు కావాలంటే ఈ పని చేయాల్సిందే..

ABN , Publish Date - Sep 24 , 2024 | 06:37 PM

PM Kisan 18th Installment: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాని నిధి యోజన కింద దేశంలో అర్హులైన రైతులకు పెట్టుబడి సాయం అందిస్తోంది. రైతులు వారి వ్యవసాయ అవసరాలను తీర్చడానికి, వారి ఆదాయాన్ని స్థిరీకరించడానికి కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రూ 6 వేలు చొప్పున ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది.

PM Kisan 18th Installment: రైతులకు అలర్ట్.. ఆ నిధులు కావాలంటే ఈ పని చేయాల్సిందే..
PM Kisan Samman Nidhi Yojana

PM Kisan 18th Installment: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాని నిధి యోజన కింద దేశంలో అర్హులైన రైతులకు కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం అందిస్తోంది. రైతులు వారి వ్యవసాయ అవసరాలను తీర్చడానికి, వారి ఆదాయాన్ని స్థిరీకరించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రూ 6 వేలు చొప్పున ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. ఈ మొత్తాన్ని రూ. 2 వేలు చొప్పున మూడు దఫాలుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఇప్పటి వరకు 17 విడతలుగా పీఎం కిసాన్ నిధిని రైతుల ఖాతాల్లో జమ చేశారు. 18వ విడత నిధులు విడుదల చేయాల్సి ఉంది. ఈ నిధుల కోసం దేశంలో రైతులంతా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ నిధుల ద్వారా దాదాపు 12 కోట్ల మంది రైతులు లబ్ధి పొందుతారని అంచనా. అయితే, 18వ విడతలో రూ. 2,000 పొందాలంటే రైతులు తప్పనిసరిగా కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. మరి ఆ కీలక విషయాలేంటో తెలుసుకుందాం..


రైతులు చేయాల్సిన ముఖ్యమైన పనులివే..

1. eKYC పూర్తి చేయాలి.

2. బ్యాంక్ ఖాతాను ఆధార్‌తో లింక్ చేయాలి.

3. భూమి రికార్డులను ధృవీకరించాలి.

eKYCని ఎలా పూర్తి చేయాలి..

Google Play స్టోర్‌లో అందుబాటులో ఉన్న ‘పీఎం కిసాన్ మొబైల్ యాప్’లో ఫేస్ రికగ్నైజేషన్ ఫీచర్‌ను ఉపయోగించి రైతులు తమ eKYCని ఇంటి నుండే సులభంగా పూర్తి చేయవచ్చు. లేదంటే.. పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి, eKYC ని పూర్తి చేయొచ్చు. మీకు ఈ ప్రాసెస్ చేయడం రాకపోతే.. సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ (CSC)లో eKYCని పూర్తి చేయొచ్చు.


మీ బ్యాంక్ ఖాతాను ఆధార్‌తో లింక్ చేయాలి..

పీఎం కిసాన్ నిధులు నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డీబీటీ) వ్యవస్థ ద్వారా బదిలీ చేయబడతాయి. ఇందుకోసం మీ బ్యాంక్ ఖాతాను మీ ఆధార్ నంబర్‌తో లింక్ చేయాల్సి ఉంటుంది. పీఎం కిసాన్ పథకం కోసం దరఖాస్తు చేసుకున్నట్లయితే.. ఆధార్, బ్యాంక్ అకౌంట్‌ని ధృవీకరించాలి. తద్వారా రూ. 2,000 అకౌంట‌లో జమ అవుతుంది.

భూ రికార్డులను ధృవీకరించాలి..

ప్రధాన మంత్రి కిసాన్ యోజన నిధులు పొందాలంటే.. రైతులు తమ భూ రికార్డులను ధృవీకరించాల్సి ఉంటుంది. భూ రికార్డుల సరిగా లేకపోతే.. పీఎం కిసాన్ ఇన్‌స్టాల్‌మెంట్ నిధులు జమ అవడంలో ఆలస్యమవుతుంది.


Also Read:

రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త..

కల్తీ నిజమని తేలితే శిక్షించాల్సిందే..

శ్రీలంక ప్రధానిగా హరిణి అమరసూర్య

For More National News and Telugu News..

Updated Date - Sep 24 , 2024 | 06:37 PM