PM Modi: వచ్చే వారంలో మోదీ ఎన్నికల ప్రచారం.. కీలక ప్రచారాస్త్రం అదే..
ABN , Publish Date - Sep 03 , 2024 | 09:26 PM
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు ఎన్నికల ర్యాలీల్లో పాల్గొంటారని, జమ్మూ ప్రాంతంలో రెండు చోట్ల, కశ్మీర్‌లో ఒక చోట బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రధాని ప్రచారం సాగిస్తారని బీజేపీ వర్గాలు తెలిపాయి.
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల (Jammu and Kashmir Elections) ప్రచారం వేడెక్కనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) వచ్చే వారం జమ్మూకశ్మీర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. మూడు ఎన్నికల ర్యాలీల్లో ప్రధాని పాల్గొంటారని, జమ్మూ ప్రాంతంలో రెండు చోట్ల, కశ్మీర్‌లో ఒక చోట బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రధాని ప్రచారం సాగిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. 370వ అధికరణ రద్దు, అనంతరం జరిగిన అభివృద్ధి, జమ్మూకశ్మీర్‌లో తొలిసారి ఎస్సీ, ఎస్టీ వర్గాలకు సీట్ల కోటా కల్పించడం వంటి అంశాలే ప్రచారాస్త్రాలుగా ప్రధాని పర్యటన ఉంటుందని తెలుస్తోంది.
Haryana Assembly Elections: పొత్తుపై కాంగ్రెస్, ఆప్ నేతలు సంప్రదింపులు
డీలిమిటేషన్ తర్వాత 43 అసెంబ్లీ స్థానాలైన జమ్మూలో కనీసం 35 సీట్లు గెలుచుకుని, కశ్మీర్‌లో తగినన్ని సీట్లు దక్కించుకోవడం ద్వారా ప్రభుత్వ ఏర్పాటులో కీలక భూమిక పోషించాలని బీజేపీ పట్టుదలగా ఉంది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు మూడు విడతలుగా సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1వ తేదీన పోలింగ్ జరుగనుండగా, అక్టోబర్ 8న ఫలితాలు వెలువడతాయి.
Read More National News and Latest Telugu New
Also Read: Chhattisgarh: ఎన్‌కౌంటర్‌లో 9 మంది మావోయిస్టులు మృతి
Also Read:RG Kar hospital: 8 రోజుల సీబీఐ కస్టడీకి ప్రొ. సందీప్ ఘోష్