Share News

Kuwait fire tragedy: కువైట్‌కు తక్షణం వెళ్లాలని మంత్రిని ఆదేశించిన మోదీ

ABN , Publish Date - Jun 12 , 2024 | 09:13 PM

కువైట్‌ లో సంభవించిన భారీ అగ్నిప్రమాద ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తక్షణ చర్యలకు దిగారు. సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు వెంటనే కువైట్ వెళ్లాలని కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్‌ ను ఆదేశించారు.

Kuwait fire tragedy: కువైట్‌కు తక్షణం వెళ్లాలని మంత్రిని ఆదేశించిన మోదీ

న్యూఢిల్లీ: కువైట్‌ (Kuwait)లో సంభవించిన భారీ అగ్నిప్రమాద ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) తక్షణ చర్యలకు దిగారు. సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు వెంటనే కువైట్ వెళ్లాలని కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్‌ (Kirti Vardhan Singh)ను ఆదేశించారు. స్థానిక వార్తా కథనాల ప్రకారం, కువైట్ సిటీలో బుధవారం ఉదయం సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో కనీసం 49 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో 40 మంది భారతీయ కార్మికులు మరణించినట్టు కూడా కొన్ని వార్తా సంస్థలు ప్రకటించాయి. అయితే ఎంఈఏ తొలి ప్రకటనలో మృతుల సంఖ్య ప్రస్తావన లేకుండా క్షతగాత్రుల సంఖ్యను మాత్రమే ప్రకటించింది. కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం కూడా ఇదే రీతిలో స్పందించింది. 30 మందికి పైగా భారతీయ కార్మికులు చికిత్స పొందుతున్నట్టు తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం కువైట్ ట్రాజెడీ తీవ్ర ఆందోళన కలిగిస్తోందని, పరిస్థితిని కువైట్‌లోని భారత ఎంబసీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని చెప్పారు.

Kuwait fire accident: కువైట్‌లో భారీ అగ్నిప్రమాదం, 41 మంది సజీవదహనం, క్షతగాత్రుల్లో పలువురు భారతీయులు


ప్రధాని ఆదేశాలపై..

కాగా, తక్షణం పరిస్థితిని సమీక్షించి, సహాయక చర్యలను పర్యవేక్షించాల్సిందిగా విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్దన్ సింగ్‌ను ప్రధానమంత్రి ఆదేశించినట్టు ఎంఈఏ ఒక ప్రకటనలో తెలిపింది. అగ్నిప్రమాదంలో గాయపడిన వారి సహాయక చర్యలను సమీక్షించడం, మృతదేహాలను వెనక్కి తెచ్చేందుకు అవసరమైన చర్యలను స్థానిక అధికారుల సమన్వయంతో చేపట్టాలని మంత్రిని ప్రధాని ఆదేశించినట్టు పేర్కొంది.

Read Latest National News and Telugu News

Updated Date - Jun 12 , 2024 | 09:13 PM