PM Modi: కువైట్ పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ
ABN , Publish Date - Dec 21 , 2024 | 11:58 AM
రెండు రోజుల పర్యటన కోసం ప్రధాని నరేంద్ర మోదీ కువైట్ బయలుదేరి వెళ్లారు. శనివారం ఉదయం న్యూఢిల్లీ ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో పీఎం మోదీ కువైట్‌కు బయలుదేరారు.
న్యూఢిల్లీ, డిసెంబర్ 21: రెండు రోజుల పర్యటన కోసం ప్రధాని నరేంద్ర మోదీ.. శనివారం కువైట్ బయలుదేరి వెళ్లారు. ఈ రోజు ఉదయం న్యూఢిల్లీ ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ప్రధాని నరేంద్ర మోదీ.. కువైట్ బయలుదేరి వెళ్లారు. దాదాపు 43 ఏళ్ల తర్వాత కువైట్‌లో భారత ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకొంది.
Also Read: లయోలా కాలేజీ యాజమాన్యంపై మార్నింగ్ వాకర్స్ ఫైర్
ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగా ఇరు దేశాల మధ్య బంధం మరింత బలోపేతం అయ్యేందుకు ఈ పర్యటన దోహదపడనుంది. అలాగే ఇరు దేశాల మధ్య వాణిజ్యం, ఇంధనం, సంస్కృతిక సంబంధాలు పురోగమిస్తాయని భావిస్తున్నారు. 1981లో నాటి భారత ప్రధాని ఇందిరా గాంధీ కువైట్‌లో పర్యటించారు. అనంతరం 2009లో నాటి భారత ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ ఆ దేశంలో పర్యటించారు.
Also Read: భవానీల దీక్ష విరమణ.. దుర్గమ్మ నామస్మరణతో మార్మోగుతోన్న ఇంద్రకీలాద్రి
రెండు రోజుల ప్రధాని పర్యటన బిజీ బిజీగా సాగనుంది. ఈ పర్యటనలో కువైట్ రాజు అమీర్ షేక్ మెషల్ అల్ అహ్మద్ అల్ జబ్బర్ అల్ సభాతో ప్రధాని మోదీ సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య బంధం మరింత దృఢ పడేందుకు వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన సహకారం, సంస్కృతి, ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలతోపాటు పలు అంశాలపై కీలకంగా చర్చించనున్నారు. అలాగే కువైట్‌లో నివసించే భారతీయులతో సైతం ప్రధాని మోదీ సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు.
Also Read: భవానీ దీక్ష విరమణలు.. సీపీ కీలక వ్యాఖ్యలు
అదేవిధంగా గల్ఫ్ కో ఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) కు కువైట్ నేతృత్వం వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జీసీసీలో భారత్ కీలక భాగస్వామిగా ఉంది. దీంతో 2022- 23 ఆర్థిక సంవత్సరంలో ఈ రెండు దేశాల మధ్య రూ.184. 46 యూఎస్ బిలియన్ డాలర్ల విలువైన ద్వైపాక్షిక వాణిజ్యం జరిగింది. అలాగే గత ఆర్థిక సంవత్సరం.. అంటే 20230-24 మధ్య ఈ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం రూ. 10.47 బిలియన్ యూఎస్ డాలర్లకు చేరుకుంది.
ఈ పర్యటనలో భాగంగా రక్షణ సహకారంతోపాటు ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందం కారణంగా భారత్ కువైట్ దేశాల మధ్య భాగస్వామ్యం కొత్త పుంతలు తొక్కుతోందని భారత విదేశీ వ్యవహారాల శాఖలోకి ఉన్నతాధికారి అరుణ్ కుమార చటర్జీ వెల్లడించారు. ప్రధాని మోదీ పర్యటనతో ఇండియా, కువైట్ దేశాల మధ్య సంబంధాలకు కొత్త అధ్యాయనానికి తెర తీస్తుందని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రధాని మోదీ కువైట్ పర్యటన ముగించుకుని సోమవారం భారత్ కు తిరిగి పయనమవనున్నారు.
For National News And Telugu News