PM Modi: మణిపూర్ అంశంపై స్పందించిన మోదీ.. ప్రతిపక్షాలకు చురకలు
ABN , Publish Date - Jul 03 , 2024 | 02:23 PM
మణిపూర్ అల్లర్లపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాజ్యసభలో స్పందించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి కేంద్రప్రభుత్వం తరపున ఆయన సమాధానమిచ్చారు.
మణిపూర్ అల్లర్లపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాజ్యసభలో స్పందించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి కేంద్రప్రభుత్వం తరపున ఆయన సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. మణిపూర్ అంశంలో అగ్నికి ఆజ్యం పోయడం ఆపాలని విపక్షాలకు సూచించారు. మణిపూర్‌లో సామాజిక సంఘర్షణకు సుదీర్ఘ చరిత్ర ఉందని తెలిపారు. ఈ తరహా హింస 1993లో జరిగిందన్నారు. ఐదేళ్లపాటు ఇలాంటి ఘటనలు నిరంతరం జరిగాయన్నారు. మణిపూర్‌లో 10 సార్లు రాష్ట్రపతి పాలన విధించారని గుర్తుచేశారు. మణిపూర్‌ను విపక్షాలు రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నాయని.. దేశ ప్రజలు వారి కుట్రలను తిరస్కరిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. మణిపూర్‌లో సాధారణ పరిస్థితిని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని మోదీ తెలిపారు. సాధారణ పరిస్థితులు తీసుకొచ్చేందుకు తమ ప్రభుత్వం నిరంతరం ప్రయత్నిస్తోందన్నారు. ప్రస్తుతం మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు తగ్గుముఖం పట్టాయని తెలిపారు. చిన్న రాష్ట్రంలో 11 వేలకు పైగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని.. మణిపూర్‌లో శాంతి పునరుద్ధరణ జరుగుతోందని మోదీ తెలిపారు. మణిపూర్‌లో పాఠశాలలు, కళాశాలలు తెరుచుకుంటున్నాయని చెప్పారు. ఇతర రాష్ట్రాల మాదిరిగానే మణిపూర్‌లో కూడా సాధారణ పరీక్షలు జరిగాయన్నారు. శాంతిభద్రతల పునరుద్ధరణ కోసం హోంమంత్రి మణిపూర్‌లోనే ఉంటూ తగిన చర్యలు తీసుకున్న విషయాన్ని గుర్తుచేశారు. అక్కడ హింసాత్మక ఘటనలు తగ్గుముఖం పడుతున్నాయని తెలిపారు.
Rajyasabha Updates: విపక్షాలకు ఎప్పటికీ అర్థంకాదు.. రాజ్యసభలో మోదీ సెటైర్లు..
అవినీతిపరులకు వార్నింగ్..
అవినీతిపరులు చట్టాల నుంచి తప్పించుకోలేరని ప్రధాని మోదీ రాజ్యసభలో తెలిపారు. బినామీ ఆస్తులపై కొత్త చట్టం తీసుకొచ్చామని అన్నారు. అవినీతిపరులను అణిచివేస్తామని 2014లోనే చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. అవినీతిపరులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. దర్యాప్తు సంస్థలకు స్వేచ్ఛా నియంత్రణ కల్పించామని, అవినీతి చట్టాల నుంచి తప్పు చేసిన వారిని రక్షించలేమని.. ఇది మోదీ హామీ అంటూ తెలిపారు.
Rajya Sabha Updates: విపక్షాలకు పోరాడే ధైర్యం లేదన్న మోదీ..
లిక్కర్ స్కామ్‌పై..
ఢిల్లీ మద్యం కుంభకోణాన్ని మోదీ ప్రస్తావిస్తూ, ఆప్ స్కామ్‌లకు పాల్పడిందని.. ఆ పార్టీని రక్షించేందుకు కాంగ్రెస్ కోర్టును ఆశ్రయించిందని మోదీ అన్నారు. మద్యం కుంభకోణంపై కాంగ్రెస్ కోర్టును ఆశ్రయించింది. కుంభకోణాలకు పాల్పడిన వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తోందన్నారు.
Floods: వరదల ఎఫెక్ట్.. 38కి చేరిన మృతులు
రాజ్యాంగానికి అతి పెద్ద ప్రతిపక్షం కాంగ్రెస్..
రాజ్యాంగానికి అతి పెద్ద ప్రతిపక్షం కాంగ్రెస్ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కాంగ్రెస్ కుటుంబ పార్టీ అని.. కుటుంబ రాజకీయాలను ప్రోత్సహించమని ఏ రాజ్యాంగం చెబుతుందన్నారు. కాంగ్రెస్‌కు కుటుంబమే ప్రధానమన్నారు. కేబినెట్ ప్రతిపాదనలను వ్యతిరేకించడానికి, పత్రాలను చించివేయడానికి ఏ రాజ్యాంగం అవకాశం ఇస్తుందన్నారు. నేడు జై రాజ్యాంగం అంటున్న వారే జై ఇందిర అని అన్నారని గుర్తుచేశారు.
PM Narendra Modi: అబద్ధాలు.. పిల్లచేష్టలు!
యువతను మోసం చేస్తే..
నీట్ పేపర్ లీక్‌పై ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఇలాంటి సున్నితమైన అంశాలపై రాజకీయాలు చేయకూడదని తాము కోరుకుంటున్నామని తెలిపారు. ప్రతిపక్షాలు మాత్రం ప్రతి అంశాన్ని రాజకీయం చేసేందుకు అలవాటు పడ్డాయని అన్నారు. యువతను మోసం చేసే వారిని వదిలిపెట్టబోమని మోదీ హెచ్చరించారు. యువత భవిష్యత్తుతో ఆడుకోవడానికి వీలు లేదన్నారు.
Hathras: హత్రాస్ తొక్కిసలాట ఘటనా స్థలానికి ఫోరెన్సిక్ బృందం.. నేడు సీఎం కూడా..
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More National News and Latest Telugu News