Share News

PM Modi: సైబర్ నేరాలపై మోదీ కీలక వ్యాఖ్యలు.. డిజిటల్ ప్రపంచంలో జాగ్రత్త అంటూ హెచ్చరిక

ABN , Publish Date - Jul 17 , 2024 | 02:52 PM

దేశవ్యాప్తంగా రోజురోజుకి సైబర్ నేరాలు(Cyber Crimes) పెరిగిపోతున్నాయి. ఈ తరహా నేరాలపై ఎంతగా అవగాహన కల్పించాలని ప్రయత్నించినా.. మారుమూల గ్రామాల్లో చాలా మంది ఇప్పటికీ మోసపోతున్నారు. ఓటీపీ చెప్పడం, లింకులు క్లిక్ చేస్తూ రూ.లక్షలు పోగొట్టుకున్న ఎంతో మంది బాధితులు ఉన్నారు. ఈ నేపథ్యంలో దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) కీలక సూచనలు చేశారు.

PM Modi: సైబర్ నేరాలపై మోదీ కీలక వ్యాఖ్యలు.. డిజిటల్ ప్రపంచంలో జాగ్రత్త అంటూ హెచ్చరిక

ఢిల్లీ: దేశవ్యాప్తంగా రోజురోజుకి సైబర్ నేరాలు(Cyber Crimes) పెరిగిపోతున్నాయి. ఈ తరహా నేరాలపై ఎంతగా అవగాహన కల్పించాలని ప్రయత్నించినా.. మారుమూల గ్రామాల్లో చాలా మంది ఇప్పటికీ మోసపోతున్నారు. ఓటీపీ చెప్పడం, లింకులు క్లిక్ చేస్తూ రూ.లక్షలు పోగొట్టుకున్న ఎంతో మంది బాధితులు ఉన్నారు.

ఈ నేపథ్యంలో దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) కీలక సూచనలు చేశారు. ఎలక్ట్రానిక్ పరికరాలపై పని పూర్తయిన వెంటనే సిస్టమ్స్ లాగౌట్ చేయాలని చెప్పారు.


‘‘రోజూ పని పూర్తయిన వెంటనే మీ సిస్టమ్స్ లాగౌట్ చేస్తారా, నేను చేస్తాను. సైబర్ భద్రత విషయంలో ఇది చాలా ముఖ్యం. రోజు చివర్లో అన్ని సిస్టమ్స్ లాగౌట్‌ అయ్యాయా, లేదా అని చూసుకొనే పనిని ప్రతీ ఆఫీస్‌లో ఒక వ్యక్తికి అప్పగించాలి. ఇంటికి వెళ్లేప్పుడు నా ఎలక్ట్రానిక్ పరికరాలను నేనే లాగౌట్ చేస్తాను. వాటిని తెరిచి ఉంచితే సైబర్ దాడుల ప్రమాదం పెరిగిపోతుంది’’ అని మోదీ హెచ్చరించారు. ఇటీవలే సీనియర్ బ్యూరోక్రాట్లతో జరిగిన సమావేశంలో ప్రధాని ఈ హెచ్చరికలు చేసినట్లు తెలుస్తోంది.

ఈ మార్చిలో ప్రధాని మోదీతో మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్‌ ‘చాయ్‌ పే చర్చ’లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా తాను బిల్ గేట్స్‌తో సైబర్ భద్రత గురించి చర్చించినట్లు చెప్పారు. మరోవైపు డీప్‌ఫేక్‌ల(deep fake) AI దుర్వినియోగంపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు.


దాని ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి చర్యలను ఇప్పటికే ప్రారంభించినట్లు తెలిపారు. సరైన శిక్షణ లేకుండా ఇలాంటి విషయాన్ని ఎవరికైనా ఇస్తే అది దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎవరూ తప్పుదోవ పట్టకుండా ఉండటానికి మనం AI కంటెంట్‌ను వాటర్‌మార్కింగ్ చేస్తూ ఉపయోగించాలని ప్రధాని మోదీ వెల్లడించారు.

మోదీ, బిల్ గేట్స్ భారతదేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ, టీకా, సాంకేతికత, మహిళా శక్తి, వాతావరణ మార్పుల గురించి మాట్లాడారు. 2023 G20 సమ్మిట్ సందర్భంగా AIని ఎలా ఉపయోగించారో ప్రధాని మోదీ చెప్పారు. కాశీ తమిళ సంగమం కార్యక్రమంలో AI తన హిందీ ప్రసంగాన్ని తమిళంలోకి ఎలా అనువదించిందనే విషయాలను ప్రధాని ప్రస్తావించారు.

For Latest News and National News click here

Updated Date - Jul 17 , 2024 | 02:52 PM