PM Modi : ట్రంప్ త్వరగా కోలుకోవాలి
ABN , Publish Date - Jul 15 , 2024 | 02:33 AM
ట్రంప్‌పై హత్యాయత్నాన్ని ప్రపంచ దేశాల అధినేతలు తీవ్రంగా ఖండించారు. ప్రధాని మోదీ, ఫ్రెంచ్ అధ్యక్షుడు మెక్రాన్, బ్రిటన్ ప్రధాని స్టార్మర్.. ట్రంప్‌పై జరిగిన కాల్పుల ఘటనపై స్పందిస్తూ .....
హత్యాయత్నాన్ని తీవ్రంగా
ఖండించిన పలు దేశాల నేతలు
వాషింగ్టన్, షికాగో, జూలై 14: ట్రంప్‌పై హత్యాయత్నాన్ని ప్రపంచ దేశాల అధినేతలు తీవ్రంగా ఖండించారు. ప్రధాని మోదీ, ఫ్రెంచ్ అధ్యక్షుడు మెక్రాన్, బ్రిటన్ ప్రధాని స్టార్మర్.. ట్రంప్‌పై జరిగిన కాల్పుల ఘటనపై స్పందిస్తూ ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదన్నారు. ‘‘నా మిత్రుడైన ట్రంప్‌పై హత్యాయత్నం తీవ్ర వేదన కలిగించింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.
ఆయన త్వరగా కోలుకోవాలి’’ అని మోదీ ఎక్స్‌లో పోస్టు చేశారు. ట్రంప్ త్వరగా కోలుకోవాలని రాహుల్‌గాంధీ, ఖర్గే ఆకాంక్షించారు. ట్రంప్‌పై హత్యాయత్నం అమెరికన్ ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి అధ్యాయం అని భారతీయ అమెరికన్లు పేర్కొన్నారు. భారతీయ అమెరికన్ల నాయకుడు డాక్టర్ భరత్ బరయ్ మాట్లాడుతూ... ఈ ఘటన చాలా విచారకరమన్నారు. బైడెన్‌కు బలమైన మద్దతుదారు అయిన అజయ్ భుటోరియా మాట్లాడుతూ... ఈ హత్యాయత్నంపై అన్ని కోణాల్లో విచారించాలన్నారు.