Share News

PM Modi: చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ.. 2019 రికార్డ్ బద్దలు

ABN , Publish Date - May 30 , 2024 | 08:52 PM

ఎవరేమనుకున్నా సరే.. ఎన్నికల ప్రచార కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తిరుగులేదు. తన బీజేపీ కోసం.. ఆయన యోధుడిలా రంగంలోకి దిగి..

PM Modi: చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ.. 2019 రికార్డ్ బద్దలు
PM Narendra Modi Election Campaign Record

ఎవరేమనుకున్నా సరే.. ఎన్నికల ప్రచార కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి (PM Modi) తిరుగులేదు. తన బీజేపీ కోసం.. ఆయన యోధుడిలా రంగంలోకి దిగి, విస్తృతస్థాయిలో ప్రచారాలు చేపడతారు. ఏడు పదుల వయసు దాటినప్పటికీ.. ఓ యువకుడిలాగా దూసుకుపోతారు. ఎంత కష్టమొచ్చినా సరే.. దాన్ని అధిగమించి ముందుకు సాగిపోతారు. ఈ సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో మోదీ ఎంత జోరుగా, హుషారుగా పాల్గొన్నారో అందరూ చూశారు. ప్రతిరోజూ ఆయన యావరేజ్‌గా మూడు నుంచి ఐదు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. సుడిగాలిలా దేశాన్ని చుట్టి వచ్చారు.


Read Also: నెక్ట్స్ టార్గెట్ అదే.. హెడ్ కోచ్ వార్తలపై గంభీర్ బాంబ్

ఈ క్రమంలోనే ప్రధాని మోదీ చరిత్ర సృష్టించారు. 2019లో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమాల కన్నా ఈసారి మరింత ఎక్కువగా నిర్వహించారు. ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటిస్తున్న సమయంలోనే.. మోదీ దక్షిణ భారతదేశంలో రాజకీయ పర్యటనలో ఉన్నారు. మార్చి 15-17 మధ్య మొత్తం ఐదు రాష్ట్రాల్ని కవర్ చేశారు. ఓవరాల్‌గా 76 రోజుల పాటు దేశవ్యాప్తంగా ఆయన ప్రచార కార్యక్రమాలు చేపట్టారు. ఈ వ్యవధిలో 200 కంటే ఎక్కువ రోడ్ షోలు, ర్యాలీలకు హాజరయ్యారు. 2019తో పోలిస్తే.. 145 బహిరంగ కార్యక్రమాల బిగ్ మార్జిన్‌తో ఆయన అధిగమించారు. రోజుల పరంగా చూసుకుంటే.. గతంలో 68 రోజులు ప్రచారంలో పాల్గొన్న మోదీ, ఈసారి 76 రోజుల పాటు ప్రచారం చేపట్టారు. దీనికితోడు.. ఎన్నికలు ప్రారంభమైన నాటి నుంచి మొత్తం 80 మీడియా ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు.

Read Also: రాహుల్ గాంధీనే నెక్ట్స్ ప్రధాని.. షారుఖ్ ట్వీట్ వెనుక అసలు కథ ఇది!

చివరగా ప్రధాని మోదీ గురువారం సాయంత్రం పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో చేసిన ఎన్నికల ప్రసంగంతో తన లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ముగించారు. ఎన్నడూ లేనంతగా విస్తృత స్థాయిలో ప్రచారం చేశారు కాబట్టి.. రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని ఆయన నిర్ణయించారు. తమిళనాడులోని కన్యాకుమారిలో ఉన్న ప్రఖ్యాత వివేకానంద రాక్ మెమోరియల్‌లో.. మే 30న సాయంత్రం నుంచి జూన్ 1వ తేదీ వరకూ ధ్యానం చేయనున్నారు.

Read Latest National News and Telugu News

Updated Date - May 30 , 2024 | 08:52 PM