Share News

Lok Sabha Elections 2024: మోదీలో టెన్షన్ కనిపిస్తోంది, స్టేజిపై కన్నీళ్లు కూడా పెట్టుకోవచ్చు: రాహుల్

ABN , Publish Date - Apr 26 , 2024 | 04:37 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలకాలంలో ఎన్నికల ప్రసంగాల్లో నెర్వస్ గా కనిపిస్తున్నారని, కొద్ది రోజుల తర్వాత బహుశా స్టేజిపైనే ఆయన కన్నీళ్లు కార్చే అవకాశం లేకపోలేదని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ అన్నారు. 24 గంటలూ ప్రజల దృష్టిని మళ్లించేందుకుకే ఆయన ప్రయత్నిస్తుంటారని విసుర్లు విసిరారు.

Lok Sabha Elections 2024: మోదీలో టెన్షన్ కనిపిస్తోంది, స్టేజిపై కన్నీళ్లు కూడా పెట్టుకోవచ్చు: రాహుల్

బిజాపూర్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఇటీవలకాలంలో ఎన్నికల ప్రసంగాల్లో నెర్వస్ (Nervous)గా కనిపిస్తున్నారని, కొద్ది రోజుల తర్వాత బహుశా స్టేజిపైనే ఆయన కన్నీళ్లు కార్చే అవకాశం లేకపోలేదని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. 24 గంటలూ ప్రజల దృష్టిని మళ్లించేందుకుకే ఆయన ప్రయత్నిస్తుంటారని విసుర్లు విసిరారు. కర్ణాటకలోని బిజాపూర్‌లో శుక్రవారంనాడు జరిగిన ఎన్నికల ప్రచార సభలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.


పేదల సొమ్ము ఊడలాక్కున్నారు

ప్రధాన మంత్రి గత పదేళ్లలో పేద ప్రజల సొమ్ములను ఊడలాక్కున్నారని, దేశంలోని 70కోట్ల మంది జనాభా వద్ద ఉన్న ఆస్తికి సమానమైన సంపదను మోదీ కేవలం 22 మంది బడా పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టారని అన్నారు. దేశంలో కేవలం ఒక శాతం మంది 40 శాతం సంపదను నియంత్రిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నిరుద్యోగం, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించి ఆర్థిక వ్యవస్థలో అందరినీ భాగస్వాములను చేస్తుందని హామీ ఇచ్చారు. బిలియనీర్లకు మోదీ నిధులు కట్టబెడితే తాము దేశంలోని పేదలకు నగదును అందజేస్తామని భరోసా ఇచ్చారు.

Lok Sabha Polls 2024: వీవీప్యాట్ల కేసులో సుప్రీంకోర్టు తీర్పుపై ఎన్నికల సభలో మోదీ స్పందన


కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చిందని రాహుల్ ఈ సందర్భంగా తెలిపారు. ఇందువల్ల ప్రజలు ఎన్నో ప్రయోజనాలు పొందారని చెప్పారు. నరేంద్ర మోదీ కొద్దిమంది వ్యక్తులనే బిలియనీర్లు చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం కోట్లాది మంది ప్రజలను లక్షాధికారులుగా తయారు చేస్తుందని అన్నారు. కర్ణాటకలో శుక్రవారం రెండో విడత పోలింగ్‌లో భాగంగా 14 సీట్లకు పోలింగ్ జరుగుతోంది.

Read Latest National News and Telugu News

Updated Date - Apr 26 , 2024 | 04:37 PM