Rahul Gandhi: సోనియా స్పందించ లేదు.. మీరైనా స్పందించండి.. రాహుల్‍కు లేఖ
ABN , Publish Date - Dec 16 , 2024 | 01:42 PM
గాంధీ కుటుంబంపై దేశ ప్రజలకు తెలియకూడనివి ఈ లేఖల్లో ఏముందని బీజేపీ ప్రశ్నించింది. 2008లో ఈ మ్యూజియం నుంచి 51 పెట్టెలను తరలించారని సోనియా గాంధీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో నెహ్రూ లేఖలు సైతం ఉన్నాయని బీజేపీ ఈ సందర్భంగా స్పష్టం చేసింది.

న్యూఢిల్లీ, డిసెంబర్ 16: భారత మాజీ ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూకు సంబంధించిన కీలకమైన పత్రాలు, లేఖలు కాంగ్రెస్ పార్టీ ఎంపీ సోనియా గాంధీ కస్టడీలో ఉన్నాయని ప్రముఖ చరిత్రకారుడు, నెహ్రూ మెమోరియల్ సభ్యుడు రిజ్వా్న్ ఖాద్రీ వెల్లడించారు. వాటిని తిరిగి తనకు అప్పగించాలని లోక్‍సభలో ప్రతిపక్ష నేత, ఎంపీ రాహుల్ గాంధీకి రిజ్వాన్ ఖాద్రి విజ్జప్తి చేశారు. ఈ మేరకు రాహుల్ గాంధీకి ఆయన సోమవారం సుదీర్ఘ లేఖ రాశారు. ఇదే అంశంపై సోనియాగాంధీకి సైతం లేఖ రాశానని ఆయన తెలిపారు.
Also Read: కాంగ్రెస్ హయాంలో అంతా జైళ్లలోనే..
కానీ ఎటువంటి స్పందన మాత్రం ఆమె నుంచి మాత్రం రాలేదని రిజ్వాన్ ఖాద్రీ ఆవేదన వ్యక్తం చేశారు. లార్డ్ మౌంట్ బాటన్ భార్య ఎడ్వినా మౌంట్ బాటన్, ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు జై ప్రకాష్ నారాయణ్, సరోజిని నాయుడు కుమార్తె పద్మజా నాయుడు, నోబుల్ పురస్కార గ్రహీత అల్బర్ట్ ఐన్ స్టీన్, అరుణా అసఫ్ అలీ, విజయలక్ష్మీ పండిట్, బాబూ జగ్జీవన్ రామ్, గోవింద్ వల్లభ్ పంత్ తదితర నేతలతో నెహ్రూ జరిపిన ఉత్తరప్రత్యుత్తరాలు వాటిలో ఉన్నాయని ఆ లేఖలో రాహుల్ గాంధీకి రిజ్వాన్ ఖాద్రి వివరించారు. వాటిని సాధ్యమైనంత త్వరగా తనకు ఇప్పించాలని ఆ లేఖలో రాహుల్ గాంధీకి రిజ్వాన్ ఖాద్రీ సూచించారు.
Also Read: రాజ్యాంగంపై చర్చ ప్రారంభించనున్న మంత్రి నిర్మలా సీతారామన్
ఇవి భారత చరిత్రలో అత్యంత ముఖ్యమైన భాగమని రిజ్వాన్ ఖాద్రీ అభిప్రాయపడ్డారు. వీటిని తిరిగి మ్యూజియంలోకి తీసుకురావాల్సి ఉందన్నారు. 2008లో నాటి యూపీఏ చైర్మన్ సోనియా గాంధీ సూచనలతోనే మ్యూజియం నుంచి ఈ పత్రాలు, లేఖలు బయటకు తీశారని ఆయన గుర్తు చేశారు. ఆ పత్రాలు సోనియా గాంధీ వద్ద ఉన్నాయని.. వాటి ఒరిజినల్ కాపీలు కానీ.. లేకుంటే డిజిటల్ కాపీలు కానీ తనకు అందజేయాలని ఈ సందర్భంగా రాహుల్ గాంధీకి ఆయన విజ్జప్తి చేశారు.
Also Read: యథావిధిగా కొనసాగనున్న పాపికొండల యాత్ర
మరోవైపు ఇదే అంశంపై 2024 సెప్టెంబర్‍లో సోనియా గాంధీకి లేఖ రాసినా.. ఇప్పటి వరకు సమాధానం మాత్రం లేదన్నారు. అలాగే ఈ లేఖలు, పత్రాలు ఎందుకు అవసరమో ఈ సందర్భంగా రాహుల్‍కు రాసిన లేఖలో వివరించారు. 1971లో ఈ లేఖలు నెహ్రూ మెమోరియల్ మ్యూజియంకు అందజేశామని ఆయన గుర్తు చేసుకున్నారు. అయితే ప్రస్తుతం ఆ మ్యూజియాన్ని ప్రధానమంత్రి మ్యూజియంగా పిలుస్తున్నారని తెలిపారు. వీటిని డిజిటలైజేషన్ చేయడం వల్ల పండితులు, పరిశోధకులు సైతం ఈ పత్రాలు అధ్యయనం చేయడానికి ఉపయోగపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
Also Read: రాజ్యసభ సభ్యులుగా నేడు ప్రమాణ స్వీకారం
ఇక ఈ వ్యవహారంపై బీజేపీ సైతం స్పందించింది. గాంధీ కుటుంబంపై దేశ ప్రజలకు తెలియకూడదని ఈ లేఖల్లో ఏముందని ప్రశ్నించింది. 2008లో సోనియా గాంధీ మ్యూజియం నుంచి 51 పెట్టెలను తొలగించాలని ఆదేశించారని, అందులో నెహ్రూ లేఖలు సైతం ఉన్నాయని బీజేపీ స్పష్టం చేసింది. మరి ఆ పత్రాలు తిరిగి ఇవ్వాలని తన తల్లి సోనియాగాంధీకి విజ్ఞప్తి చేస్తారా? అంటూ రాహుల్ గాంధీని ఈ సందర్భంగా బీజపీ సూటిగా ప్రశ్నించారు.
Also Read: తుపాన్‍తో చిగురుటాకులా వణుకుతోన్న ‘మయోట్’
2010లోనే సదరు పత్రాలు, లేఖలు డిజిటలైజ్ చేయాలని నిర్ణయించినట్లు అయితే ఆ లేఖలను సోనియా గాంధీ ఎందుకు తొలగించారని బీజేపీ మండిపడుతూ ప్రశ్నించింది. కాంగ్రెస్ పార్టీలో పారదర్శకత లేదని విమర్శించారు. నెహ్ర, లేడి ఎడ్వినా మౌంట్ బాటన్ తోపాటు ఇతరులకు పండిట్ నెహ్రూ ఏం రాశారో తెలుసుకునే హక్కు ప్రజలకు సైతం ఉందని బీజేపీ ఈ సందర్భంగా స్పష్టం చేసింది.
For National News And Telugu News