Narendra Modi: నేడు బెంగాల్, బీహార్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించనున్న ప్రధాని మోదీ
ABN , Publish Date - Mar 02 , 2024 | 09:16 AM
ప్రధాని మోదీ(Narendra Modi) ఈరోజు బెంగాల్, బీహార్‌కు అనేక ప్రాజెక్టులను బహుమతిగా ఇవ్వనున్నారు. బీహార్‌లో ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని మొదటి పర్యటన ఇదే కావడం విశేషం.
ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) ఈరోజు బెంగాల్(Bengal), బీహార్(Bihar)లకు అనేక ప్రాజెక్టులను బహుమతిగా ఇవ్వబోతున్నారు. ఉదయం 10.30 గంటలకు పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లాలోని కృష్ణానగర్‌కు చేరుకోనున్న ప్రధాని, అక్కడ రూ.15 వేల కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. మధ్యాహ్నం 2.30 గంటలకు బీహార్‌లోని ఔరంగాబాద్‌లో రూ.21,400 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేస్తారు.
అంతకుముందు శుక్రవారం ప్రధాని మోదీ(Modi) ఆరంబాగ్‌లో పలు రైల్వే పథకాలను ప్రారంభించి శంకుస్థాపన చేశారు. సందేశ్‌ఖలీ కుంభకోణం సూత్రధారిని కాపాడినందుకు టీఎంసీ, మమత ప్రభుత్వంపై ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. బెంగాల్‌లోని ఆరంబాగ్, జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లను సందర్శించిన అనంతరం ప్రధాని మోదీ నిన్న రాత్రి కోల్‌కతాలోని రాజ్‌భవన్‌లో విశ్రాంతి తీసుకున్నారు.
సందేశ్‌ఖాలీ(sandeshkhali)లో టీఎంసీ నాయకత్వాన్ని మోదీ విమర్శించారు. తృణమూల్ కాంగ్రెస్(TMC) ఏం చేసిందో చూసి యావత్ దేశం విచారం వ్యక్తం చేసిందని వ్యాఖ్యానించారు. సందేశ్ ఖాలి సోదరీమణులపై TMC చేసిన పని సిగ్గుపడాల్సిన విషయమని గుర్తు చేశారు. అలాంటి దురాగతాలకు TMC దగ్గర సమాధానం లేదన్నారు. ఈ క్రమంలో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్ ప్రజలు ఓటు ద్వారా సమాధానం చెప్పాలని కోరారు. అలాంటి పార్టీని మీరు క్షమిస్తారా? టీఎంసీని క్షమిస్తారా? ప్రతి గాయానికి ఓటు ద్వారా సమాధానం చెప్పాలని మోదీ అన్నారు.
సుందర్‌బన్స్ ముఖద్వారం వద్ద ఉన్న సందేశ్‌ఖాలీ ప్రాంతంలో TMC నాయకుడు షాజహాన్ షేక్, అతని సహచరులపై లైంగిక దోపిడీ, భూకబ్జా ఆరోపణలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే 55 రోజులుగా పరారీలో ఉన్న షేక్‌ను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఆ నిందితులను కాపాడేందుకు ముఖ్యమంత్రి మమతా(mamata banerjee) అన్ని విధాలా కృషి చేశారని మోదీ ఆరోపించారు. బీజేపీ నేతృత్వంలోని నిరసనల ఒత్తిడి ఫలితంగానే ఇది జరిగిందని ప్రధాని పేర్కొన్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Rameswaram Cafe Blast: సిద్ధరామయ్య ప్రభుత్వంపై బీజేపీ సంచలన వ్యాఖ్యలు