Share News

Puja Khedkar: చిక్కుల్లో ట్రైనీ ఐఏఎస్ ఆఫీసర్.. వికలాంగ సర్టిఫికేట్ కోసం ఫేక్ అడ్రస్ ప్రూఫ్

ABN , Publish Date - Jul 17 , 2024 | 12:34 PM

ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్(Puja Khedkar) కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో వికలాంగ ధృవీకరణ పత్రం( disability certificate) కోసం పూజా ఏకంగా తప్పుడు చిరునామా, నకిలీ రేషన్ కార్డును ఉపయోగించారు.

Puja Khedkar: చిక్కుల్లో ట్రైనీ ఐఏఎస్ ఆఫీసర్.. వికలాంగ సర్టిఫికేట్ కోసం ఫేక్ అడ్రస్ ప్రూఫ్
Puja Khedkar

ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్(Puja Khedkar) కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో వికలాంగ ధృవీకరణ పత్రం( disability certificate) కోసం పూజా ఏకంగా తప్పుడు చిరునామా, నకిలీ రేషన్ కార్డును ఉపయోగించారు. ఖేద్కర్ ‘ప్లాట్ నెం. 53, దేహు-అలంది, తల్వాడే’ అనే చిరునామాను యశ్వంతరావు చవాన్ మెమోరియల్ (YCM) ఆసుపత్రికి సమర్పించారు. అది(maharashtra) పింప్రి చించ్‌వాడ్‌లోని తన ఇల్లు అని పేర్కొన్నారు.

అయితే ఆ చిరునామా థర్మోవెరిటా ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్, మూతపడిన కంపెనీకి చెందినదని వెలుగులోకి వచ్చింది. అంతేకాదు అది అసలు నివాస ప్రాపర్టీ కాదని తేలింది. ఆగస్టు 24, 2022న జారీ చేసిన సర్టిఫికెట్‌లో మోకాలిలో ఏడు శాతం వైకల్యం ఉన్నట్లు పేర్కొన్నారు. దీంతోపాటు అదే థర్మోవెరిటా కంపెనీ పేరు మీద ఆడి కారు కూడా రిజిస్టర్ చేయబడింది. పింప్రి చించ్‌వాడ్ మునిసిపాలిటీ పన్ను వసూళ్ల విభాగం ప్రకారం ఈ కంపెనీకి గత మూడేళ్లుగా రూ. 2.7 లక్షల బకాయి ఉంది.


ఫేక్ సర్టిఫికేట్

2023 బ్యాచ్ ఐఏఎస్ అధికారిని పూజా ఖేద్కర్ UPSC రిక్రూట్‌మెంట్ కోసం నకిలీ అంగవైకల్య ధృవీకరణ పత్రాన్ని తయారు చేసిన ఆరోపణలపై విచారణలో ఉన్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో OBC నాన్-క్రీమీ-లేయర్ హోదా కూడా పరిశీలనలోకి వచ్చింది. మరోవైపు పూజా ఖేద్కర్ తండ్రి దిలీప్ ఖేద్కర్ ఆస్తులపై సమగ్ర నివేదికను పుణెలోని అవినీతి నిరోధక శాఖ (ACB) మంగళవారం సాయంత్రం రాష్ట్ర ప్రధాన కార్యాలయానికి సమర్పించింది.


ప్రవర్తన కారణంగా

2020లో పదవీ విరమణ చేసే వరకు మహారాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (MPCB) డైరెక్టర్‌గా పనిచేసిన దిలీప్ ఖేద్కర్ తన పదవీ కాలంలో ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారని ఆరోపణలు వచ్చాయి. ఉన్నతాధికారుల పరిశీలన అనంతరం తదుపరి చర్యలు తీసుకోనున్నారు. ఇప్పటికే పూజా ప్రవర్తన గురించి పూణే జిల్లా కలెక్టర్ సుహాస్ దివాసే సీనియర్ అధికారులకు నివేదిక సమర్పించారు. ఆ తర్వాత ఆమె పూణే నుంచి వాషిమ్‌కు అదనపు అసిస్టెంట్ కలెక్టర్‌గా బదిలీ చేయబడింది. ఆ క్రమంలో ప్రత్యేక కార్యాలయం, అధికారిక నివాసం, కారు, సహాయక సిబ్బంది కావాలని పూజ డిమాండ్ చేసింది. అయితే ట్రైనీ అధికారులు ఈ అలవెన్సులకు అర్హులు కాదు.


వేధింపుల ఫిర్యాదు

ఆ క్రమంలోనే ఆమె గురించి అనేక విషయాలు క్రమంగా వెలుగులోకి వచ్చాయి. ఖేద్కర్‌పై వచ్చిన ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ విచారణ జరుపుతోంది. ఈ క్రమంలో లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌ ఆమెను రీకాల్ చేసింది. కానీ ఖేద్కర్ ఈ ఆరోపణలను తిరస్కరించారు. పుణె జిల్లా కలెక్టర్‌పై వేధింపుల ఫిర్యాదు చేశారు.


ఇవి కూడా చదవండి:

Digvijaya Singh: మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని కోర్టును ఆశ్రయించిన దిగ్విజయ్ సింగ్


Delhi: గవర్నర్‌‌ పరువు భంగం కలిగించొద్దు.. మమతా బెనర్జీకి హైకోర్టు సూచన

ప్రైవేటు ఉద్యోగాల్లో 75% స్థానికులకే!


For Latest News and National News click here

Updated Date - Jul 17 , 2024 | 12:39 PM