Modi vs Rahul: రాహుల్ గాంధీ దెబ్బ.. ఒక్క స్వీట్ బాక్స్‌తో మోదీ ఇమేజ్ డ్యామేజ్
ABN , Publish Date - Jun 16 , 2024 | 10:43 AM
ప్రధాని నరేంద్ర మోదీపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తారాస్థాయిలో విరుచుకుపడ్డారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో ఎనిమిదిసార్లు తమిళనాడుకు వచ్చి మోదీ..
ప్రధాని నరేంద్ర మోదీపై (PM Modi) తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ (MK Stalin) తారాస్థాయిలో విరుచుకుపడ్డారు. లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Polls 2024) సమయంలో ఎనిమిదిసార్లు తమిళనాడుకు వచ్చి మోదీ సంపాదించిన ఇమేజ్‌ని.. కేవలం ఒక్క స్వీట్ బాక్స్‌తో రాహుల్ గాంధీ (Rahul Gandhi) డ్యామేజ్ చేశారని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు తమకు ఓటు వేసి గెలిపించినందుకు.. శనివారం కోయంబత్తూరులో నిర్వహించిన ‘విజయ ర్యాలీ’ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘చివరిసారిగా నేను కోయంబత్తూరులో లోక్‌సభ ఎన్నికల ప్రచారం నిర్వహించినప్పుడు.. అది దేశవ్యాప్తంగా ట్రెండ్ అయ్యింది. ఎందుకంటే.. ఎన్నికల సమయంలో మోదీ తమిళనాడులో 8 సార్లు పర్యటించి సంపాదించిన ఇమేజ్‌ని రాహుల్ కేవలం ఒక్క స్వీట్‌తో ముక్కలు చేసిపారేశారు. ఆ టైంలో రాహుల్ రాష్ట్రానికి వచ్చి, నాకు స్వీట్ బాక్స్ ఇచ్చారు. సోదరుడు రాహుల్ నాపై చూపిన ప్రేమను నేనెప్పటికీ మర్చిపోను’’ అని సీఎం స్టాలిన్ చెప్పుకొచ్చారు. తమిళనాడులో మోదీ 8 సార్లు పర్యటించి కూడా ఏం సాధించలేకపోయారని ఆయన ఎద్దేవా చేశారు. బీజేపీ తన సొంత బలంతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని తూర్పారపట్టారు. ముఖ్యమంత్రులు చంద్రబాబు, నితీశ్ కుమార్ మద్దతు వల్లే నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని అయ్యారని.. ఇది మోదీ వైఫల్యమేనని విమర్శించారు.
ఈ ఎన్నికల్లో మన రాజ్యాంగం, ప్రజాస్వామ్యం గెలిచాయని.. ఇప్పుడు తనకు నచ్చిన పని బీజేపీ చేయలేదని స్టాలిన్ దుయ్యబట్టారు. కేంద్రంలో బీజేపీకి సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం లేకుండా చేశామని, ఇది లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమికి చారిత్రాత్మక విజయమని పేర్కొన్నారు. డీఎంకే నేతృత్వంలోని ఇండియా కూటమి 40 స్థానాల్లో సాధించిందని అన్నారు. ఇండియా కూటమి భాగస్వాములు కలిసి వస్తాయని బీజేపీ ఎప్పుడూ అనుకోలేదన్నారు. దర్యాప్తు సంస్థలతో బెదిరించేందుకు బీజేపీ ప్రయత్నం చేసినా.. కాంగ్రెస్ ఖాతాలను స్తంభింపజేసినా.. ఇతర వ్యూహాలు రచించినా.. ఎన్నో కోట్లు ఖర్చు పెట్టినా.. ఆ పార్టీ 240 సీట్లే గెలుచుకోగలిగిందని స్టాలిన్ చెప్పుకొచ్చారు.
Read Latest National News and Telugu News