Share News

మహా వికాస్‌ అఘాడీ సర్కారు కూల్చివేతలో అదానీ హస్తం

ABN , Publish Date - Nov 16 , 2024 | 03:55 AM

మహారాష్ట్రలో మహావికాస్‌ అఘాడీ ప్రభుత్వాన్ని కూల్చివేయడంలో పారిశ్రామికవేత్త గౌతమ్‌ అదానీ హస్తం ఉందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆరోపించారు.

మహా వికాస్‌ అఘాడీ సర్కారు కూల్చివేతలో అదానీ హస్తం

ధారావిని సొంతం చేసుకునేందుకే:రాహుల్‌

నాందేడ్‌, నవంబరు 15: మహారాష్ట్రలో మహావికాస్‌ అఘాడీ ప్రభుత్వాన్ని కూల్చివేయడంలో పారిశ్రామికవేత్త గౌతమ్‌ అదానీ హస్తం ఉందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. 2019లో అవిభాజ్య ఎన్సీపీ, బీజేపీ మధ్య జరిగిన సమావేశంలో అదానీ పాల్గొన్నట్లుగా ఇటీవల అజిత్‌ పవార్‌ వెల్లడించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రాజకీయ పార్టీల పొత్తు సమావేశంలో ఓ పారిశ్రామికవేత్తకు పనేంటని ప్రశ్నించారు. ధారావి ప్రాంతంపై అదానీ ఆనాడే కన్నేశారని, దానిని సొంతం చేసుకోవడానికి రాజకీయంగా పావులు కదిపారని అన్నారు. ఇందులో మోదీ పాత్ర కూడా ఉందని రాహుల్‌ ఆరోపించారు.

Updated Date - Nov 16 , 2024 | 03:55 AM