Rahul Gandhi : కాంగ్రెస్ తరఫున 100 ఇళ్లు
ABN , Publish Date - Aug 03 , 2024 | 04:20 AM
వయనాడ్‌లో సంభవించింది మహా విపత్తని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని ప్రత్యేకంగా పరిగణించాలని విపక్షనేత రాహుల్‌గాంధీ సూచించారు. సోదరి ప్రియాంకతో కలిసి శుక్రవారం కూడా వయనాడ్‌లో పర్యటించిన ఆయన...
వయనాడ్, ఆగస్టు 2: వయనాడ్‌లో సంభవించింది మహా విపత్తని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని ప్రత్యేకంగా పరిగణించాలని విపక్షనేత రాహుల్‌గాంధీ సూచించారు. సోదరి ప్రియాంకతో కలిసి శుక్రవారం కూడా వయనాడ్‌లో పర్యటించిన ఆయన... స్థానిక అధికారులతో చర్చించారు. కాంగ్రెస్ పార్టీ తరపున వయనాడ్‌లో 100కు పైగా ఇళ్లను నిర్మిస్తామని వాగ్ధానం చేశారు. కొండచరియలు విరిగిపడే ప్రమాదం పొంచి ఉన్న ప్రాంతాల్లో నివసించబోమని ప్రజలు చెబుతున్నారని, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ఇప్పటికే ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు.