Share News

Rahul Gandhi: నీట్ అవకతవకలపై చర్చ జరగాలి.. ప్రధాని మోదీని డిమాండ్ చేసిన రాహుల్

ABN , Publish Date - Jun 28 , 2024 | 04:16 PM

నీట్‌ పరీక్ష నిర్వహణలో(NEET Paper Leakage) అవకతవకలఅంశంపై పార్లమెంట్‌లో చర్చ జరగాలని కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ పక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi)ని డిమాండ్ చేశారు.

Rahul Gandhi: నీట్ అవకతవకలపై చర్చ జరగాలి.. ప్రధాని మోదీని డిమాండ్ చేసిన రాహుల్

ఢిల్లీ: నీట్‌ పరీక్ష నిర్వహణలో(NEET Paper Leakage) అవకతవకలఅంశంపై పార్లమెంట్‌లో చర్చ జరగాలని కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ పక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi)ని డిమాండ్ చేశారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టే ముందు ఈ అంశంపై లోతైన చర్చ జరగాలని కోరారు.

"యువత ఆందోళన చెందుతున్నారు. వారికి ఏం జరుగుతుందో తెలియదు. విద్యార్థుల ఆందోళనలను తగ్గించడానికి పార్లమెంటులో అధికార, ప్రతిపక్షాలు చర్చించాలి. వారిలో భయాందోళనలు తొలగించాలి. ఇది యువతకు సంబంధించిన సమస్య కాబట్టి, ఈ సమస్యపై లోక్ సభలో గౌరవప్రదమైన చర్చ జరగాలని నేను ప్రధానిని కోరుతున్నారు. నీట్ పేపర్ లీకేజీపై చర్చ జరగాలని ఇప్పటికే ప్రతిపక్ష నేతలందరూ అంగీకరించారు. దేశ భవిష్యత్తు యువతది. వారికి ప్రభుత్వం తగిన న్యాయం చేయాలి" అని రాహుల్ కోరారు.


పేపర్ లీకేజీ జరిగిందిలా..

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (అండర్ గ్రాడ్యుయేట్) / నీట్-యూజీని మే 5న NTA నిర్వహించింది. ఈ ప్రవేశ పరీక్షకు దాదాపు 24 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. జూన్ 4న ఫలితాలు ప్రకటించగా, బీహార్ వంటి రాష్ట్రాల్లో ప్రశ్నపత్రాల లీకేజీలు, ఇతర అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. 60కిపైగా విద్యార్థులకు ఫస్ట్ ర్యాంక్ రావడంతో ఆరోపణలు బలపడ్డాయి. దీంతో UGC-NET, NEET పరీక్షలను కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ రద్దు చేసింది.

For Latest News and Tech News click here..

Updated Date - Jun 28 , 2024 | 04:16 PM