Om Birla: మోదీకి తలవంచడంపై ఓం బిర్లా ఏమన్నారంటే..?
ABN , Publish Date - Jul 01 , 2024 | 06:58 PM
రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదులు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సోమవారంనాడు చేసిన ఒక ప్రస్తావనకు సభాపతి ఓం బిర్లా ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. పెద్దలను గౌరవించడమనే సంస్కృతిని తాను పాటించినట్టు చెప్పారు.
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదులు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సోమవారంనాడు చేసిన ఒక ప్రస్తావనకు సభాపతి ఓం బిర్లా ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. సభాపతి నిష్పాక్షికంగా ఉండాల్సిన అవసరాన్ని రాహుల్ ప్రస్తావిస్తూ, స్పీకర్ పదవిని చేపట్టినప్పుడు సభాపతి ఆసనం వరకూ తాను కూడా ఓంబిర్లా (OM Birla)తో వెళ్లానని గుర్తు చేశారు. తాను చేతులు కలిపినప్పుడు నిటారుగా నిలబడి స్పీకర్ చేతులు కలిపారని, మోదీ షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు మాత్రం ఆయన వంగి నమస్కరించారని అన్నారు. 'మోదీకి తలవంచారనే' అర్థం వచ్చేలా రాహుల్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి అమిత్‌షా వెంటనే అభ్యంతరం వ్యక్తం చేశారు. సభాపతి స్థానాన్ని రాహుల్ అగౌరవపరుస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. దీనిపై ఓం బిర్లా వెంటనే స్పందిస్తూ, తన చర్యకు కారణాన్ని సభకు వివరించారు.
Rajya Sabha: ఖర్గే, ధన్‌ఖడ్ మధ్య సరదా సంభాషణ.. పెద్దల సభలో నవ్వులే నవ్వులు...
''ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభానేతగా ఉన్నారు. పెద్దవాళ్ల ముందు, అందులోనూ ఎదురెదురుగా ఉండి చేతులు కలపాల్సి వచ్చినప్పుడు వినయంగా తలవంచాలని మన సంస్కృతి నాకు నేర్పింది'' అని ఓం బిర్లా సమాధానమిచ్చారు. దీనికి రాహుల్ తిరిగి స్పందిస్తూ , స్పీకర్ మాటలను తాను గౌరవిస్తానని, అయితే తాను స్పీకర్ స్థానం ప్రాధాన్యత గురించే చెబుతున్నానని, స్పీకర్ కంటే ఎవరూ పెద్ద కాదని అన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోెసం ఇక్కడ క్లిక్ చేయండి..