Rahul Gandhi: మోదీ ప్రపంచంలో వాస్తవాన్ని తొలగించవచ్చు.. రియాల్టీలో కాదన్న రాహుల్..
ABN , Publish Date - Jul 02 , 2024 | 01:27 PM
రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల్లో కొన్నింటిని తొలగించారన్న వార్తలపై కాంగ్రెస్ ఎంపీ, ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ స్పందించారు.
రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల్లో కొన్నింటిని తొలగించారన్న వార్తలపై కాంగ్రెస్ ఎంపీ, ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ స్పందించారు. మోదీ ప్రపంచంలో వాస్తవాన్ని తొలగించగలరని.. వాస్తవానికి నిజాన్ని తొలగించలేరన్నారు. మోదీ ప్రపంచంలో సత్యాన్ని నిర్మూలించగలరు.. వారికి ఉన్న సంఖ్యాబలంతో అలా చేయగలరని.. వాస్తవానికి నిజం అనేది ఎప్పటికీ అలాగే ఉంటుందని.. దానిని ఎవరూ వాస్తవిక ప్రపంచంలో తొలగించలేరన్నారు. తాను చెప్పాల్సిందే సభలో చెప్పానని.. అది ఎవరు అవునన్నా.. కాదన్నా వాస్తవమన్నారు. వారు కోరుకుంటే సభ రికార్డుల్లో తన వ్యాఖ్లయను తొలగించవచ్చని.. అయితే సత్యం ఎప్పటికీ అలాగే నిలబడి ఉంటుందన్నారు. వాస్తవం ఎప్పటికీ వాస్తవంగానే ఉంటుందన్నారు. మోదీ ప్రపంచంలో వారు కోరుకున్నది చేసుకోవచ్చని చెప్పారు.
Parliament: పార్లమెంట్‌లో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ఎంపీల సమావేశం
అసలేం జరిగింది..
రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాహుల్ గాంధీ సోమవారం లోక్‌సభలో మాట్లాడుతూ.. కేంద్రప్రభుత్వ వైఖరిపై తీవ్ర విమర్శలు చేశారు. పలు మతాలకు సంబంధించిన అంశాలను ప్రస్తావించారు. మైనార్టీల పట్ల బీజేపీ అన్యాయంగా వ్యవహరిస్తోందని.. హింసకు పాల్పడుతోందని ఆరోపించారు. దీంతో రాహుల్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ స్పీకర్‌కు బీజేపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును పరిశీలించిన తర్వాత రాహుల్ ప్రసంగంలో కొన్ని వ్యాఖ్యలు తొలగించాలని ఆయన లోక్‌సభ సెక్రటరీకి ఆదేశాలు జారీచేశారు. దీంతో స్పీకర్ ఆదేశాలతో రాహుల్ ప్రసంగంలో అభ్యంతరకర వ్యాఖ్యలను తొలగించినట్లు లోక్‌సభ సచివాలయం తెలిపింది. పారిశ్రామికవేత్తలు అదానీ, అంబానీ, అగ్నివీర్ పథకంపై కాంగ్రెస్ ఎంపీ చేసిన వ్యాఖ్యలలోని కొన్ని భాగాలను తొలగించినట్లు తెలుస్తోంది.
Rahul Gandhi : మీరు హిందువులు కాదు!
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More National News and Latest Telugu News