Home » Lok Sabha Speaker Om Birla
ఇండియా కూటమి పక్షాల నిరసన మధ్య కేంద్రప్రభుత్వం వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును లోక్‌సభలో మైనార్టీ వ్యవహరాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రవేశపెట్టారు. తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ముస్లిం సమాజం మెచ్చుకునేదిగా ఉందన్నారు.
Andhrapradesh: కింజరాపు రామ్మోహన్ నాయుడు. తండ్రి ఎర్రన్నాయుడు మరణానంతరం 26 సంవత్సరాలకే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన రామ్మోహన్ టీడీపీలో అంచలంచెలుగా ఎదిగారు. మూడు సార్లు వరుసగా ఎంపీగా ఎన్నికయ్యారు. ఎంపీగా ఉంటూ ఏపీలో అనేక సమస్యలపై పార్లమెంటులో గళమెత్తారు. ఇప్పుడు కేంద్రమంత్రిగా తనదైన శైలిలో ముందుకు దూసుకెళ్తున్నారు.
రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల్లో కొన్నింటిని తొలగించారన్న వార్తలపై కాంగ్రెస్ ఎంపీ, ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ స్పందించారు.
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై కాంగ్రెస్ ఎంపీ, ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ లోక్‌సభలో సోమవారం చేసిన ప్రసంగం తీవ్ర దుమారానికి కారణమైంది. కేంద్రప్రభుత్వంపై రాహుల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
లోక్‌సభ సమావేశాలు ఏడో రోజు ప్రారంభం కాగానే.. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని స్పీకర్ ఓంబిర్లా కొనసాగించారు. సోమవారం వివిధ పార్టీల ఎంపీలు మాట్లాడగా.. మిగిలిన చర్చను ఇవాళ కొనసాగించారు.
పద్దెనిమిదో లోక్‌సభ స్పీకర్‌గా బీజేపీ ఎంపీ ఓం బిర్లా ఎన్నికయ్యారు. 48 ఏళ్ల తర్వాత మళ్లీ లోక్‌సభ సభాధ్యక్ష పదవికి ఎన్నిక జరగ్గా.. ఓం బిర్లా మూజువాణి ఓటుతో విజయం సాధించారు.
స్పీకర్ ఓం బిర్లా బుధవారం సభనుద్దేశించి మాట్లాడుతూ.. దేశంలో ఎమర్జెన్సీ రోజులను గురించి ప్రస్తావించడంతో.. తొలిరోజే లోక్‌సభలో గందరగోళం నెలకొంది.
లోక్‌సభలో మొదటిసారిగా జనసేన పార్టీ ఎంపీలు అడుగుపెట్టారు. ఆ పార్టీ తరపున లోక్‌సభకు ఇద్దరు పోటీచేసి గెలిచారు. పొత్తులో భాగంగా ఎన్డీయే కూటమిలో జనసేన భాగస్వామ్యంగా ఉంది. దీంతో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఎన్నికల్లో పోటీచేశాయి.
లోక్‌సభ స్పీకర్ ఎన్నిక పూర్తైంది. 50 ఏళ్ల తర్వాత తొలిసారి లోక్‌సభ స్పీకర్ పదవికి ఎన్నిక జరిగుతుందని భావించినప్పటికీ.. స్పీకర్‌గా ఓంబిర్లా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ ప్రకటించారు. తొలుత స్పీకర్ పదవిని ఏకగ్రీవం చేసుకునేందుకు బీజేపీ చేసిన ప్రయత్నం ఫలించలేదు.
ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి సంబంధించి 18వ లోక్‌సభలో ఓ అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. ఎన్నికల ముందు వరకు ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఒకరినొకరు తీవ్ర స్థాయిలో విమర్శించుకున్నారు.