Share News

Congress: సిద్దరామయ్య, రాహుల్ గాంధీకి కోర్టు సమన్లు. ఎందుకంటే..?

ABN , Publish Date - Feb 23 , 2024 | 08:04 PM

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కర్ణాటక ఎంపీ, ఎమ్మెల్యే కోర్టు సమన్లు జారీచేసింది. కర్ణాటక సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు సమన్లు ఇచ్చింది. గత కర్ణాటక ప్రభుత్వం 40 శాతం కమీషన్లు తీసుకుంటుందని ముగ్గురు నేతలు ఆరోపించిన సంగతి తెలిసిందే.

Congress: సిద్దరామయ్య, రాహుల్ గాంధీకి కోర్టు సమన్లు. ఎందుకంటే..?

బెంగళూర్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి (Rahul Gandhi) కర్ణాటక ఎంపీ, ఎమ్మెల్యే కోర్టు సమన్లు జారీచేసింది. రాహుల్ గాంధీతోపాటు (Rahul Gandhi) కర్ణాటక సీఎం సిద్దరామయ్య (Siddaramaiah), డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు సమన్లు ఇచ్చింది. గత కర్ణాటక ప్రభుత్వం 40 శాతం కమీషన్లు తీసుకుంటుందని రాహుల్ గాంధీ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆ అంశాన్ని బీజేపీ లీగల్ సెల్‌కు చెందిన న్యాయవాది వినోద్ కుమార్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ విచారణకు స్వీకరించిన ధర్మాసనం మార్చి 28వ తేదీన కోర్టుకు హాజరుకావాలని రాహుల్, సిద్దరామయ్య, డీకే శివకుమార్‌కు స్పష్టం చేసింది.

Rahul Gandhi: రాహుల్ గాంధీ మన అధినేత.. న్యాయ యాత్రలో పాల్గొనండి: కమల్ నాథ్

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పే సీఎం పోస్టర్లను కాంగ్రెస్ పార్టీ ఉపయోగించింది. పోస్టర్ మీద అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ఫొటో, క్యూఆర్ కోడ్ ముద్రించారు. బీజేపీ పాలనలో 40 శాతం కమీషన్ అని తీవ్ర ఆరోపణలు చేశారు. దానిపై న్యాయవాది వినోద్ కుమార్ ఎంపీ, ఎమ్మెల్యే కోర్టులో పిటిషన్ వేశారు. 40 శాతం కమీషన్ ఆరోపణలకు సంబంధించి కేసు విచారణను 6 వారాల్లో పూర్తి చేయాలని కర్ణాటక హైకోర్టు గత వారం స్పష్టం చేసింది. దాంతో రాహుల్ గాంధీకి కోర్టు సమన్లు జారీచేసింది.

Rahul Gandhi: రాహుల్ గాంధీ మన అధినేత.. న్యాయ యాత్రలో పాల్గొనండి: కమల్ నాథ్

కర్ణాటకలో గత బీజేపీ ప్రభుత్వం 40 శాతం కమీషన్లు తీసుకుందనే ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం 50 శాతం కమీషన్లు తీసుకుంటుందని బీజేపీ అంటోంది. ఈ మేరకు కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ఆరోపణలు చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 23 , 2024 | 08:04 PM