Rahul Gandhi: లండన్‌కు రాహుల్ ప్రయాణం...అట్నుంచి అమెరికాకు
ABN , Publish Date - Sep 06 , 2024 | 09:01 PM
రాహుల్ గాంధీ సెప్టెంబర్ 8 నుంచి 10 వరకూ అమెరికాలో పర్యటించనున్నట్టు కాంగ్రెస్ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ శామ్ పిట్రోడా ఇటీవల ఒక వీడియో విడుదల చేశారు. సెప్టెంబర్ 8న ఢల్లాస్, 9-10 తేదీల్లో వాషింగ్టన్ డీసీలో పర్యటిస్తారని ఆయన వెల్లడించారు.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) శుక్రవార రాత్రి 1.50 గంటలకు లండన్‌కు బయలుదేరుతున్నారు. ఫ్లయిట్ బీఏ-142లో రాహుల్ లండన్‌కు వెళ్తారని, లండన్ పర్యటన అనంతరం అమెరికా వెళ్తారని పార్టీ విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. లోక్‌సభలో విపక్ష నేతగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాహుల్ గాంధీ విదేశాల్లో పర్యటించనుండటం ఇదే ప్రథమం.
Congress: ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన వినేశ్ ఫొగట్, బజరంగ్ పునియా..
రాహుల్ గాంధీ సెప్టెంబర్ 8 నుంచి 10 వరకూ అమెరికాలో పర్యటించనున్నట్టు కాంగ్రెస్ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ శామ్ పిట్రోడా ఇటీవల ఒక వీడియో విడుదల చేశారు. సెప్టెంబర్ 8న ఢల్లాస్, 9-10 తేదీల్లో వాషింగ్టన్ డీసీలో పర్యటిస్తారని ఆయన వెల్లడించారు. రాహుల్ గాంధీ విపక్ష నేతగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయనతో ముఖాముఖీ కోరుతూ ఇండియన్ ఓవర్సీస్ చైర్మన్‌గా ఉన్న తనకు 32 దేశాలకు చెందిన భారతీయ దౌత్యవేత్తలు, విద్యావేత్తలు, వ్యాపారులు, నేతలు, అంతర్జాతీయ మీడియా, ఇతరుల నుంచి విజ్ఞప్తులు వెల్లువెత్తాయని, ఈ నేపథ్యంలో స్వల్ప పర్యటన కోసం రాహుల్ ఆమెరికా వస్తున్నారని వివరించారు.రాహుల్ అమెరికా పర్యటన విజయవంతం చేయడానికి తామంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని చెప్పారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Karnataka: కర్ణాటకలో వెలుగులోకి మరో స్కాం..