Share News

Mamata Banerjee: డీరైల్‌మెంట్స్‌లో ఇండియన్ రైల్వేస్‌దే ప్రపంచ రికార్డు

ABN , Publish Date - Sep 24 , 2024 | 09:44 PM

పశ్చిమబెంగాల్‌లోని జల్‌పాయ్‌గురి జిల్లాలో ఖాళీగా వెళ్తున్న గూడ్సురైలుకు చెందిన ఐదు బోగీలు మంగళవారం ఉదయం పట్టాల తప్పిన నేపథ్యంలో ఇండియన్ రైల్వేస్‌పై మమతా బెనర్జీ విమర్శలు గుప్పించారు.

Mamata Banerjee: డీరైల్‌మెంట్స్‌లో ఇండియన్ రైల్వేస్‌దే ప్రపంచ రికార్డు

కోల్‌కతా: భారతీయ రైల్వేస్‌పై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) విమర్శలు గుప్పించారు. పట్టాలు తప్పడంలో (Derailments) ఇండియన్ రైల్వే ప్రపంచ రికార్డు సృష్టించిందని అన్నారు. పశ్చిమబెంగాల్‌లోని జల్‌పాయ్‌గురి జిల్లాలో ఖాళీగా వెళ్తున్న గూడ్సురైలుకు చెందిన ఐదు బోగీలు మంగళవారం ఉదయం పట్టాల తప్పిన నేపథ్యంలో మమతా బెనర్జీ ఈ వ్యాఖ్యలు చేశారు.


'రైల్వేలకు ఏం జరిగింది? ఇవాళ కూడా పట్టాలు తప్పని వార్త వచ్చింది. పట్టాలు తప్పిన ఘటనల్లో రైల్వే శాఖ ప్రపంచ రికార్డు సృష్టించింది. ప్రజల సేఫ్టీ, సెక్యూరిటీ ప్రమాదంలో పడ్డాయి. రైళ్లలో ప్రయాణించాలంటేనే భయపడుతున్నారు. రైల్వే మంత్రి ఎక్కడున్నారు? ఎన్నికల్లో ఓట్ల కోసం రావడం వల్ల ప్రయోజనం లేదు. ప్రజలు ప్రమాదంలో ఉన్నప్పుడు వారి పక్షాన ఉండాలి'' అని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌పై పరోక్ష విమర్శలు గుప్పించారు. కేంద్ర రైల్వే మంత్రిగా మూడుసార్లు తాను పనిచేసినప్పుడు ఆ శాఖను సాఫీగా నడిపానని, పశ్చిమబెంగాల్‌కు రూ.2 లక్షల కోట్లు విలువచేసే పలు ప్రాజెక్టులు కేటాయించినట్టు చెప్పారు.

Ashwini Vaishnaw: రైల్వే ట్రాక్‌ విధ్వంసం కుట్రలపై అప్రమత్తంగా ఉన్నాం


అశ్విని వైష్ణవ్ కౌంటర్

కాగా, మమతా బెనర్జీ వ్యాఖ్యలపై రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ వెంటనే స్పందించారు. మమతా బెనర్జీకి రాజకీయాలు చేయడమే కానీ రైల్వే భద్రత గురించి అవగాహన లేదన్నారు. రైల్వే మంత్రిగా ఆమె హయాంలో ఆటోమాటిక్ యాండీ-కొలిజన్ డివైజ్‌ను ఏర్పాటు చేశారనీ, అయితే దానికి సేఫ్టీ సర్టిఫికేషన్, సరైన పరీక్షలు లేనందున 1,500 కిలోమీటర్ల తర్వాత దాన్ని తొలగించారని చెప్పారు. కేవలం పాపులారిటీ కోసమే ఈ డివైజ్‌ను ఆమె ఏర్పాటు చేశారని అన్నారు. అయితే, ఇవాళ మోదీ నాయకత్వంలో రైల్వేస్‌లో శాశ్వతమైన మార్పులు జరుగుతున్నాయని, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీని అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు.


Read More National News and Latest Telugu News

ఇవి కూడా చదవండి:

NIA: యువతను జిహాద్‌కు సిద్ధం చేస్తున్న సంస్థపై కేసు..11 చోట్ల ఎన్ఐఏ దాడులు

Bank Holidays: అక్టోబర్‌లో బ్యాంకు సెలవులు ఎన్నిరోజులంటే.. పనిచేసేది మాత్రం..

Updated Date - Sep 24 , 2024 | 09:44 PM