Share News

Rains: తుఫానుగా మారనున్న వాయుగుండం.. డెల్టా ప్రాంతంలో భారీ వర్షం

ABN , Publish Date - Nov 22 , 2024 | 10:03 AM

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఈ నెల 25వ తేదీనాటికి తుఫానుగా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ కారణంగా రాష్ట్రంలోని కోస్తాతీర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

Rains: తుఫానుగా మారనున్న వాయుగుండం.. డెల్టా ప్రాంతంలో భారీ వర్షం

- నీట మునిగిన పంటలు

చెన్నై: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఈ నెల 25వ తేదీనాటికి తుఫానుగా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ కారణంగా రాష్ట్రంలోని కోస్తాతీర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. బుధవారం శ్రీలంకకు దక్షిణంగా కేంద్రీకృతమైవున్న వాయుగుండం కొంతదూరం జరిగి గల్ఫ్‌ ఆఫ్‌ మన్నార్‌ ప్రాంతంవైపు వచ్చింది. ఇది దక్షిణ తమిళనాడుకు సమీపానికి కదులుతూ వస్తోంది. ఈ కారణంగా గల్ఫ్‌ ఆఫ్‌ మన్నార్‌తో పాటు రామేశ్వరం(Rameshwaram), శ్రీలంకలోని కోస్తాతీర ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు పేర్కొన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: కాగ్‌ అధిపతిగా సంజయ్‌ మూర్తి ప్రమాణం


రాష్ట్రంలోని దక్షిణాది జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ముఖ్యంగా కొడిక్కరై, రామేశ్వరం, ధనుష్కోడి ప్రాంతాల్లో రెండు రోజుల పాటు వర్షం కురుస్తుందన్నారు. అదేవిధంగా కన్నియాకుమారి, తూత్తుకుడి, సేలం, ఈరోడ్‌, కోయంబత్తూరు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ తుఫాను తీరాన్ని దాటే సమయంలో భారీ ఈదురుగాలులతో పాటు భారీ వర్షం కురవవచ్చని పేర్కొన్నారు.


40 వేల ఎకరాల్లో మునిగిన పంట

గత రెండు మూడు రోజులుగా డెల్టా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో 40 వేల ఎకరాల్లో పంట నీట మునిగింది. నాగపట్టణం జిల్లాలో బుధవారం భారీ వర్షం కురిసింది. గురువారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు జల్లులు కురిసాయి. పుదుకోట జిల్లాలోని కోస్తాతీర ప్రాంతాలైన ఆరంతాంగి, మీమిసల్‌, కోట్టైపట్టిణం, జెగదాపట్టిణం తదితర ప్రాంతాల్లో గురువారం ఉదయం తేలికపాటి వర్షం కురిసింది. కరూర్‌, పెరంబలూరు, అరియలూరు, తిరుచ్చి జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉంది. వర్షాల కారణంగా నాగపట్టణం జిల్లాలో రెండు వేల ఎకరాల్లో , వేదారణ్యం తదితర ప్రాంతాల్లో 12,500 ఎకరాల్లో పంట నీట మునిగింది. తంజావూరు జిల్లా ఒరత్తనాడు తాలూకాలోని పలు గ్రామాల్లో 500 ఎకరాల్లో పంట నీట మునిగింది.

nani1.jpg


అటవీ ప్రాంతంలోకి వెళ్లొద్దు...

తిరువారూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండడంతో ఆసియాలోనే అతిపెద్ద అటవీ ప్రాంతంగా పేరున్న అలైయాత్తికాట్టు అటవీ ప్రాంతంలోకి ఎవరూ వెళ్ళకుండా జిల్లా యంత్రాంగం నిషేధం విధించింది. తదుపరి ప్రకటన వెలువడేంత వరకు అటవీ ప్రాంతంలోకి ఎవరూ వెళ్ళొద్దని పేర్కొంది. ఈ నేపథ్యంలో జిల్లాలో కురుస్తున్న భారీ వర్షానికి అటవీ ప్రాంతంలో భారీగా వర్షపు నీరు ప్రవహిస్తుంది. ఈ కారణంగా అటవీ ప్రాంతంలోకి ఎవరూ వెళ్ళొద్దని అటవీ శాఖ, స్థానిక అధికారులు కోరారు.


తామ్రభరణిలో వరద

తిరునల్వేలి జిల్లాలో గత వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలకు తామ్రభరణి నది పరివాహక ప్రాంతాల్లో వరదలు సంభవించాయి. ఆ నది నుంచి రహదారులపై నీరు పొంగి ప్రవహిస్తోంది. నదీ జలాలు ప్రవేశించడంతో కుర్కుక్కుతురై మురుగన్‌ ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది. దీంతో గురువారం ఉదయం ఆ ఆలయంలో జరగాల్సిన వివాహాలను మరో ప్రాంతానికి మార్గారు. ఆ ఆలయ గర్భాలయానికి భక్తులెవరూ వెళ్ళకుండా అధికారులు నిషేధం విధించడంతోపాటు గర్భాలయ ప్రాంతానికి ఎవరూ వెళ్లకుండా బారికేడ్లు కూడా పెట్టారు. తామ్రభరణి నదిలోకి అదనపు జలాలు అధికంగా వస్తుండడంతో గురువారం ఉదయం నదికి రువైపులా గట్లను దాటి పొంగ్రిపవహిస్తోంది.

nani1.3.jpg


ఈవార్తను కూడా చదవండి: ప్రేమోన్మాది ఘాతుకం.. తరగతి గదిలో టీచర్ దారుణహత్య

ఈవార్తను కూడా చదవండి: మావోయిస్టుల దుశ్చర్య.. ఏం చేశారంటే..

ఈవార్తను కూడా చదవండి: రేవంత్‌తో టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు భేటీ

ఈవార్తను కూడా చదవండి: అదానీతో బీజేపీ, కాంగ్రెస్‌ అనుబంధం దేశానికే అవమానం: కేటీఆర్‌

Read Latest Telangana News and National News

Updated Date - Nov 22 , 2024 | 10:03 AM