Rains: ఐదు రోజులు మోస్తరు వర్షాలు..
ABN , Publish Date - Dec 26 , 2024 | 10:02 AM
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, లక్షద్వీప్ ప్రాంతంలో నెలకొన్న ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఐదు రోజులు స్వల్ప వర్షాలు కురుస్తాయని వాతావరణ పరిశోధన కేంద్రం తెలియజేసింది.
చెన్నై: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, లక్షద్వీప్ ప్రాంతంలో నెలకొన్న ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఐదు రోజులు స్వల్ప వర్షాలు కురుస్తాయని వాతావరణ పరిశోధన కేంద్రం తెలియజేసింది. గత అక్టోబరులో రాష్ట్రంలో ప్రవేశించిన నైరుతి రుతుపవనాల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. అనంతరం నవంబరులో ‘పెంగల్’ తుఫాను, అనంతరం అల్పపీడనం ప్రభావంతో విల్లుపురం, తిరువణ్ణామలై(Villupuram, Tiruvannamalai) సహా పలు జిల్లాలు తీవ్ర నష్టం చవిచూశాయి.
ఈ వార్తను కూడా చదవండి: ప్రేమ పేరుతో వేధింపులు.. యాసిడ్ తాగి యువతి మృతి
ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో ఈ నెల 30వ తేది వరకు మోస్తరు వర్షాలు కురవనున్నాయి. రాజధాని నగరం చెన్నై(Chennai)లో ఆకాశం మేఘావృతంగా ఉంటూ కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
ఈవార్తను కూడా చదవండి: Investigation: కర్త, కర్మ, క్రియ.. కేటీఆరే!
ఈవార్తను కూడా చదవండి: Hyderabad: జానీ మాస్టర్ లైంగిక వేధింపులు నిజమే
ఈవార్తను కూడా చదవండి: ఆహా.. ఏం ఐడియాగురూ.. వాట్సాప్ డీపీ మార్చి.. మెసేజ్ పంపి..
ఈవార్తను కూడా చదవండి: Pneumonia: పిల్లలపై న్యుమోనియా పంజా
Read Latest Telangana News and National News