Rains: బలపడిన అల్పపీడనం.. 5 రోజులు వర్షాలు
ABN , Publish Date - Dec 12 , 2024 | 10:27 AM
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారనుండటంతో రాష్ట్రంలో బుధవారం ఉదయం నుండే చెదురుమదురుగా వర్షాలు కురుస్తున్నాయి. బలపడిన అల్పపీడనం తీరం వైపు కదులుతుండటంతో రానున్న ఐదు రోజులు రాష్ట్రంలో పలు చోట్ల భారీగా, ఓ మోస్తరుగా వర్షాలు కురువనున్నాయి.
చెన్నై: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారనుండటంతో రాష్ట్రంలో బుధవారం ఉదయం నుండే చెదురుమదురుగా వర్షాలు కురుస్తున్నాయి. బలపడిన అల్పపీడనం తీరం వైపు కదులుతుండటంతో రానున్న ఐదు రోజులు రాష్ట్రంలో పలు చోట్ల భారీగా, ఓ మోస్తరుగా వర్షాలు కురువనున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మంగళవారం అల్పపీడనంగా మారింది.
ఈ వార్తను కూడా చదవండి: Rahul Gandhi: బీజేపీ ఎంపీల వ్యాఖ్యలను తొలగించండి
నైరుతి బంగాళాఖాతంలో ప్రవేశించి పశ్చిమ వాయవ్య దిశగా పయనించి బుధవారం శ్రీలంక, రాష్ట్రంలోని సముద్రతీరాల తీరాల వైపు కదులుతోందని, దీని ప్రభావంతో చెన్నైతోపాటు కడలూరు, మైలాడుదురై, నాగపట్టినం(Kadalore, Mylapore, Nagapattinam), తంజావూరు, తిరువారూరు, పుదుకోట జిల్లాల్లో పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి. గురువారం శివగంగ, రామనాథపురం, శివగంగ, రామనాథపురం, తిరుచ్చి, పెరంబలూరు, అరియలూరు, కళ్ళకురిచ్చి, విల్లుపురం, చెంగల్పట్టు, కాంచీపురం, చెన్నై, తిరువళ్లూరు జిల్లాల్లో ఓ మోస్తరుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్...
బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం కారణంగా ఆరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. కడలూరు, మైలాడుదురై, నాగపట్టినం, తంజావూరు, తిరువారూరు, పుదుకోట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆ ఆరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. గురువారం డెల్టా జిల్లాల్లోనూ పలు చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు.
రాజధాని నగరంలో వర్షం...
అల్పపీడనం తీరం వైపు కదులుతుండటంతో నగరంలో పలుచోట్ల బుధవారం ఉదయం చెదురుమదురుగా వర్షాలు కురిశాయి. రాయపేట, ట్రిప్లికేన్, మనలి, తిరువొత్తియూరు, తండయార్‌పేట, రాయపురం, మైలాపూరు, అడయారు, మందవెళ్ళి, ఆళ్వార్‌పేట, తాంబరం, కోయంబేడు, మధురవాయల్, పూందమల్లి, అన్నానగర్, పెరంబూరు, కొళత్తూరు తదితర ప్రాంతాల్లో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. గురువారం నగరంలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. సముద్రతీర ప్రాంతాల్లో గురువారం గంటకు 45 కి.మీ.ల నుండి 55 కి.మీల వేగంతో పెనుగాలులు వీస్తాయని, అలల తాకిడి కూడా అధికంగా ఉంటుందని వివరించారు.
ఈవార్తను కూడా చదవండి: Special Trains: శబరిమలకు 26 ప్రత్యేక రైళ్లు: ద.మ. రైల్వే
ఈవార్తను కూడా చదవండి: హాస్టల్ ఫుడ్ పాయిజన్ ఘటనల్లో.. ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌పై అనుమానాలు
ఈవార్తను కూడా చదవండి: విద్యార్థుల సమస్యలు పట్టవా రేవంత్: కవిత
ఈవార్తను కూడా చదవండి: ఉత్తమ పార్లమెంటేరియన్ తరహాలో ఏటా ఉత్తమ లెజిస్లేచర్ అవార్డు
Read Latest Telangana News and National News