Share News

Rains: వదలని వరుణుడు.. మెట్రో ప్రయాణానికి అంతరాయం

ABN , Publish Date - Oct 17 , 2024 | 01:49 PM

తుఫాను ప్రభావం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. తీరప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా బెంగళూరు(Bengaluru) శివారు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వాన కురుస్తోంది. ప్రత్యేకించి నగరంలో రెండోరోజు బుధవారం లక్షలాదిమందిని ఇబ్బంది కలిగించినట్టయ్యింది.

Rains: వదలని వరుణుడు.. మెట్రో ప్రయాణానికి అంతరాయం

బెంగళూరు: తుఫాను ప్రభావం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. తీరప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా బెంగళూరు(Bengaluru) శివారు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వాన కురుస్తోంది. ప్రత్యేకించి నగరంలో రెండోరోజు బుధవారం లక్షలాదిమందిని ఇబ్బంది కలిగించినట్టయ్యింది. సోమవారం రాత్రి ఆరంభమైన వాన మంగళవారం రాత్రి దాకా కొనసాగింది. ఒకటి రెండు గంటలపాటు విరామం ఇచ్చినట్టు అనిపించినా మరోసారి బుధవారం కూడా ఇదే పరిస్థితి నెలకొంది. యలహంక(Yalahanka) పరిధిలోని కేంద్రీయ విహార అపార్ట్‌మెంట్‌లో ఇటీవలే వరద నీరు చేరి తీవ్ర సమస్య ఏర్పడిన విషయం తెలిసిందే. మరోసారి యలహంక చెరువుకు నీరు పోటెత్తడంతో కేంద్రీయ విహార్‌ అపార్ట్‌మెంట్‌కు బుధవారం కూడా భారీగా నీరు వచ్చింది.

ఈ వార్తను కూడా చదవండి: Chennai: ఊటీ రైలు పట్టాలపై మట్టిచరియలు, బండరాళ్లు


కాలిఫోర్నియా లే అవుట్‌ పూర్తిగా జలమయమైంది. ప్రముఖ ఎంఎన్‌సీ, ఐటీ కంపెనీలు ఉండే మాన్యతాటెక్‌పార్క్‌ రోడ్డు నదులను తలపించాయి. ద్విచక్రవాహనాలలో వెళ్లే పరిస్థితి లేకపోవడం, కార్లు కూడా సగం మునిగిపోయేలా మారింది. రోడ్లపై ముందుకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఐటీ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోంను ప్రకటించారు. రోడ్లపై నీరు నిల్వ ఉండడంతో సమస్య ఏర్పడింది. మాన్యతాటెక్‌ పార్క్‌ ప్రాంతం జలపాతంలా మారిందనే ట్రోల్స్‌ దేశ విదేశాలలో హల్‌చల్‌ చేశాయి. ఇదే ప్రాంతంలో భారీ భవన నిర్మాణాలకు సంబంధించి 30 అడుగుల మేర తవ్వకాలు జరిపిన చోట మట్టి కుంచించుకుపోయింది.


pandu1.jpg

చూస్తుండగానే ప్రహరీ కూలిపోయింది. కేఆర్‌పుర(KRpura) పరిధిలోని సాయి లే అవుట్‌ ప్రజల కష్టాలు మరింత అధికమయ్యాయి. నగరంలో వర్షం కురిస్తే చాలు లోతట్టు ప్రాంతమైన సాయి లే అవుట్‌కు నీరు చేరేది. మూడు రోజులుగా వాన కురుస్తుండడంతో ప్రజలు ఇళ్లలో ఉండలేక, బయటకు రాలేక ఇబ్బంది పడుతున్నారు. నగరంలో రెండోరోజు ట్రాఫిక్‌ తీవ్ర ఇబ్బంది కలిగించింది. 142 ఇళ్లలోకి నీరు చేరగా 39 చెట్లు నేలకూలాయి.


మెట్రో ట్రాక్‌పై విరిగిన చెట్టు: ఇందిరానగర్‌కు అనుబంధంగా ఉండే స్వామి వివేకానంద మెట్రోస్టేషన్‌ సమీపంలో చెట్టుకొమ్మలు ట్రాక్‌పై విరిగిపడ్డంతో మెట్రో సంచారానికి బ్రేక్‌ పెట్టారు. విద్యుత్‌ సరఫరాను పూర్తిగా ఆపేశారు. కొమ్మలు తొలగించే ప్రక్రియ చేపట్టారు. కొన్ని గంటల తర్వాత పునరుద్ధరించి మెట్రో సంచారం సాగింది.


పలు రైళ్లు రద్దు: రాష్ట్రంతోపాటు తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తుండడంతో నైరుతి రైల్వే పరిధిలో పలు రైళ్లను రద్దు చేశారు. చెన్నైలోని బేసిన్‌ బ్రిడ్జ్‌ జంక్షన్‌పై నీరు ప్రవహిస్తుండడంతో మైసూరు కేఎస్ఆర్‌, మాల్గుడి ఎక్స్‌ప్రెస్‌, మైసూరు ఎంజీఆర్‌ - చెన్నై సెంట్రల్‌, కావేరి ఎక్స్‌ప్రె్‌సతోపాటు పలు రైళ్ల సంచారాన్ని నిలిపివేశారు. అదే తరహాలోనే తీరప్రాంత జిల్లాలకు వెళ్లే రైళ్ల సమయంలోనూ వ్యత్యాసం ఉన్నట్టు ప్రకటించారు.


ఇదికూడా చదవండి: పోలీసుల అదుపులో మావోయిస్టు అగ్రనేత సుజాత...

ఇదికూడా చదవండి: హైడ్రాకు జీహెచ్‌ఎంసీ, మునిసిపల్‌ అధికారాల బదిలీ

ఇదికూడా చదవండి: Revenue System: మళ్లీ గ్రామ రెవెన్యూ వ్యవస్థ!

ఇదికూడా చదవండి: బతుకమ్మరోజు ఆడబిడ్డలకు ఒక్కచీరా ఇవ్వలేదు

Read Latest Telangana News and National News

Updated Date - Oct 17 , 2024 | 01:49 PM