Share News

Rains: బలహీనపడిన అల్పపీడనం.. అయినా తేలికపాటి వర్షం

ABN , Publish Date - Nov 15 , 2024 | 11:03 AM

నైరుతి బంగాళాఖాతంలో ఈ నెల 12వ తేదీ ఏర్పడి స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడనం బలహీనపడింది. అయినప్పటికీ ఉత్తర తమిళనాడు కోస్తాతీరం నైరుతి బంగాళాఖాతంలో చెన్నై(Chennai)కి సమీపంలో బాహ్య ఉపరితల ఆవర్తన ద్రోణి నెలకొంది. ఈ కారణంగా తిరువళ్లూరు, వేలూరు, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో వర్షాలు కురుస్తాయనివాతావారణ కేంద్రం తెలిపింది.

Rains: బలహీనపడిన అల్పపీడనం.. అయినా తేలికపాటి వర్షం

  • నేడు 18 జిల్లాలకు అలెర్ట్‌

చెన్నై: నైరుతి బంగాళాఖాతంలో ఈ నెల 12వ తేదీ ఏర్పడి స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడనం బలహీనపడింది. అయినప్పటికీ ఉత్తర తమిళనాడు కోస్తాతీరం నైరుతి బంగాళాఖాతంలో చెన్నై(Chennai)కి సమీపంలో బాహ్య ఉపరితల ఆవర్తన ద్రోణి నెలకొంది. ఈ కారణంగా తిరువళ్లూరు, వేలూరు, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో వర్షాలు కురుస్తాయనివాతావారణ కేంద్రం తెలిపింది. కేరళ సముద్రతీర ప్రాంతానికి సమీపంలో ఆగ్నేయ అరేబియా సముద్రంలో బాహ్య ఉపరితల ఆవర్తన ద్రోణి ఏర్పడింది.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: సైబర్‌ నేరగాళ్లు కాజేసిన డబ్బు రికవరీ


nani1.2.jpg

దీని ప్రభావం కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాలతోపాటు పుదుచ్చేరి, కారైక్కాల్‌(Puducherry, Karaikal)లో తేలికపాటి వర్షాలు కురిశాయి. గురువారం చెంగల్పట్టు, కాంచీపురం, కళ్ళకుర్చి, తిరువణ్ణామలై, విల్లుపురం, కడలూరు, మైలాడుదురై, నాగపట్టణం, తంజావూరు, తిరువారూర్‌(Nagapattinam, Thanjavur, Thiruvarur), అరియలూరు, పెరంబలూరు, పుదుక్కోట, శివగంగై, మదురై, విరుదునగర్‌, తెన్‌కాశి, రామనాథపురం, తేని, తూత్తుకుడి, తిరునెల్వేలి, కన్నియాకుమారి, రామనాథపురం, శివగంగై, నీలగిరి, కోయంబత్తూరు, తిరుపూరు తదితర ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడ్డాయి. ఈ నెల 15న పైన పేర్కొన్న జిలాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. 16వ తేదీన నీలగిరి, కోయంబత్తూరు, తిరుపూరు, తేని, దిండిగల్‌ జిల్లాల సహా చెన్నై, దాని పరిసర ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురుస్తుందని ఐఎండీ అధికారులు తెలిపారు.


చెన్నైలో తగ్గిన వర్షపాతం: చెన్నై నగరంలో బుధవారం భారీ వర్షం కురుస్తుందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. కానీ, కనిషంగా కూడా వర్షం పడలేదు. దీనికి గల కారణాలను వాతావరణ నిపుణులు వెల్లడించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడటం, కొత్తగా మరో రెండు అల్పపీడనాలు నాగపట్టణం, చెన్నైల సమీపంలో ఏర్పడ్డాని వీటి కారణంగా చెన్నై నగరంలో ఆశించిన స్థాయిలో వర్షం పడలేదని తెలిపారు. అలాగే, చెన్నైకు ఉత్తరంగా ఉన్న తిరువళ్ళూరు, రాణిపేట, ఏపీలోని దక్షిణ కోస్తా జిల్లాల్లో వర్షాలు కురిశాయని తెలిపారు. ఈ వాయుగుండం తన స్థానాన్ని మార్చుకుంటుందని అందువల్ల చెన్నైలో శుక్రవారం వర్షం కురిసే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు.


ఈవార్తను కూడా చదవండి: కేసు పెట్టాల్సింది.. సీఎం బ్రదర్స్‌పైనే

ఈవార్తను కూడా చదవండి: మాజీ మంత్రి మల్లారెడ్డి మోసం చేశారు

ఈవార్తను కూడా చదవండి: 14 రకాల వివరాలివ్వండి..

ఈవార్తను కూడా చదవండి: ‘లగచర్ల’పై ఉన్నత స్థాయి విచారణ

Read Latest Telangana News and National News

Updated Date - Nov 15 , 2024 | 11:29 AM