Share News

Viral News: పోలీసులపై రాళ్ల దాడి, ఓ వాహనం దగ్ధం.. 100 మందికి పైగా అరెస్టు

ABN , Publish Date - Nov 14 , 2024 | 07:55 AM

రాజస్థాన్‌ టోంక్‌లో అసెంబ్లీ ఉపఎన్నిక సందర్భంగా పెద్ద దుమారం రేగింది. ఓటింగ్ సమయంలో స్వతంత్ర అభ్యర్థి నరేష్ మీనా ఓ అధికారి చెంపపై కొట్టారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. ఆ క్రమంలో పోలీసులపై పలువురు రాళ్ల దాడి చేశారు.

Viral News: పోలీసులపై రాళ్ల దాడి, ఓ వాహనం దగ్ధం.. 100 మందికి పైగా అరెస్టు
Rajasthan

రాజస్థాన్‌లోని (Rajasthan) టోంక్ జిల్లాలో SDM చెంపదెబ్బ ఘటనతో కలకలం పెరిగింది. నరేష్ మీనా మద్దతుదారులు డియోలీ-యునియారాలో వీధుల్లోకి చేరి హల్‌చల్ సృష్టించారు. పలు వాహనాలకు నిప్పుపెట్టి ధ్వంసం చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు చర్యలు తీసుకొని నరేష్ మీనా మద్దతుదారులను 100 మందికి పైగా అదుపులోకి తీసుకున్నారు. ఆ క్రమంలో టోంక్ జిల్లా డియోలీ ఉనియారా అసెంబ్లీ నియోజకవర్గంలో బుధవారం రాత్రి స్వతంత్ర అభ్యర్థి నరేష్ మీనా మద్దతుదారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. మీనా, ఆయన మద్దతుదారులను నిరసన స్థలం నుంచి తొలగించడానికి పోలీసు బలగాలు ప్రయత్నించినప్పుడు ఈ సంఘటన చోటుచేసుకుంది.


ఎన్నికల విధుల్లో ఉన్న అధికారిపై ఎటాక్

ఒక వాహనానికి జనం నిప్పుపెట్టినట్లు నిర్ధారించినట్లు అధికారులు తెలిపారు. శాంతిభద్రతలను అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు. దీనికి ముందు డియోలి ఉనియారా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న నరేష్ మీనా, ఎన్నికల విధుల్లో నిమగ్నమైన మల్పురా సబ్-డివిజనల్ అధికారి అమిత్ చౌదరి చెంపపై కొట్టారు. ఈ ఘటన జరిగిన సమయంలో చౌదరి సమ్రావత గ్రామంలోని గ్రామస్తులను ఓటు వేయమని నమ్మించే ప్రయత్నం చేశారని ఆరోపిస్తున్నారు. చౌదరి రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (RAS) అధికారి కావడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.


ఘటనా స్థలం నుంచి

సంరవత పోలింగ్ కేంద్రంలో జరిగిన ఈ సంఘటన సీసీ కెమెరాలో రికార్డైంది. వీడియోలో స్వతంత్ర అభ్యర్థి నరేష్ మీనా పోలింగ్ బూత్‌లోకి ప్రవేశించి SDM అమిత్ చౌదరిని చెంపదెబ్బ కొట్టారు. అనంతరం పోలీసులు మీనాను పోలింగ్ బూత్ నుంచి బయటకు తీసుకెళ్లారు. అప్పటి నుంచి ఘటనా స్థలంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మీనా మద్దతుదారులు ఆందోళన చేయడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. ఈ కోలాహలం నేపథ్యంలో స్వతంత్ర అభ్యర్థి నరేష్ మీనా అక్కడి నుంచి వెళ్లిపోగా, ఆయనను పోలీసులు ఇంకా అరెస్ట్ చేయలేదు. అరెస్టు చేసేందుకు పోలీసులు వెళ్లినట్లు సమాచారం.


పెన్‌ డౌన్‌ సమ్మె

ఈ క్రమంలోనే మీనాను అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ అధికారుల సంఘం డిమాండ్ చేసింది. అరెస్ట్‌ చేయకుంటే గురువారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘పెన్‌ డౌన్‌’ సమ్మె చేపడతామని హెచ్చరించింది. దేవ్లీ-యునియారాతో సహా రాష్ట్రంలోని ఏడు అసెంబ్లీ స్థానాలకు బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉప ఎన్నికలకు ఓటింగ్ జరిగింది. ఓట్ల లెక్కింపు నవంబర్ 23న జరుగుతుంది.


ఇవి కూడా చదవండి:

Childrens Day 2024: బాలల దినోత్సవం సందర్భంగా మీ పిల్లల స్క్రీన్ టైం ఇలా తగ్గించండి.. ఇవి కూడా నేర్పించండి..


Childrens Day 2024: చిల్డ్రన్స్ డే స్పెషల్.. మీ పిల్లలను ఇలా సర్ ప్రైజ్ చేయండి..


Vegetable Prices: షాకింగ్.. త్వరలో పెరగనున్న కూరగాయల ధరలు, కారణమిదేనా...

Credit Card New Rules: క్రెడిట్ కార్డ్ యూజర్లకు అలర్ట్.. నవంబర్ 15 నుంచి కొత్త రూల్స్..


Bank Holidays: నవంబర్ 2024లో బ్యాంక్ సెలవులు.. దాదాపు సగం రోజులు బంద్..

Read More National News and Latest Telugu News

Updated Date - Nov 14 , 2024 | 07:57 AM