Rajiv Gandhi Assassination: రాజీవ్ గాంధీ హత్య కేసు దోషి మృతి
ABN , Publish Date - Feb 28 , 2024 | 12:08 PM
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో విడుదలైన దోషి సంతాన్ తాజాగా మరణించారు. చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో సంతాన్ తుదిశ్వాస విడిచారు.
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసు(Rajiv Gandhi assassination case)లో దోషిగా ఉన్న సంతాన్(Santhan) బుధవారం గుండెపోటుతో మరణించారు. సంతాన్ అలియాస్ టి. సుతేంద్రరాజా(55) శ్రీలంక జాతీయుడిగా ఉన్నారు. ఇతను మాజీ ప్రధాని హత్య కేసులో 20 ఏళ్లకు పైగా జైలు శిక్ష అనుభవించిన తర్వాత 2022లో సుప్రీంకోర్టు విడుదల చేసిన ఏడుగురిలో ఒకరిగా ఉన్నాడు. ఉదయం 7.50 గంటలకు సంతాన్ మృతి చెందినట్లు చెన్నై(chennai)లోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ డీన్ ఇ థెరానీరాజన్ తెలిపారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Chennai: మద్దతిస్తే రూ.5 కోట్లు ఇస్తామన్నారు.. ఓపీఎస్‌పై అన్నాడీఎంకే ప్రిసీడియం చైర్మన్ సంచలన ఆరోపణ
సంతాన్ కాలేయం పాడైపోయి ఆస్పత్రిలో(Hospital) చికిత్స పొందుతున్న క్రమంలో బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు అతనికి గుండెపోటు వచ్చిందని వైద్యులు అన్నారు. ఆ క్రమంలో సంతాన్‌కు చికిత్స చేసినా ఫలితం లేకపోవడంతో ఈరోజు ఉదయం 7.50 గంటలకు మృతి చెందాడు. మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించి మృతదేహాన్ని శ్రీలంకకు తరలించేందుకు చట్టపరమైన ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు తెలిపారు. జనవరి 27న తిరుచిరాపల్లిలోని ప్రత్యేక శిబిరం నుంచి సంతాన్ ఆస్పత్రిలో చేరినట్లు డీన్ తెలిపారు. సంతాన్ విడుదలైన తర్వాత తిరుచిరాపల్లిలోని ప్రత్యేక శిబిరంలో ఉంచారు.