Share News

Rakesh Tikait: రాకేష్ టికాయత్ 'బటోగే తో లుటోగే' నినాదం

ABN , Publish Date - Dec 16 , 2024 | 09:18 PM

ఖనౌరీలో నిరాహార దీక్ష కొనసాగిస్తున్న దలేవాల్‌ను టికాయత్ గత వారంలో కలుసుకున్నారు. 70 ఏళ్ల కేనర్స్ పేషెంట్ అయిన దలేవాల్ నవంబర్ 26వ తేదీ నుంచి పంజాబ్-హర్యానా కనౌరి సరిహద్దు ప్రాంతం వద్ద ఆమరణ దీక్షలో ఉన్నారు.

Rakesh Tikait: రాకేష్ టికాయత్ 'బటోగే తో లుటోగే' నినాదం

న్యూఢిల్లీ: రైతు డిమాండ్లపై పంజాబ్ రైతు నేత జగ్జిత్ సింగ్ దలేవాల్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష సోమవారంనాడు 21వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో రైతు సంఘాల ఐకమత్యానికి సంయుక్త కిసాన్ మోర్చా నేత రాకేష్ టికాయత్ (Rakesh Tikait) పిలుపునిచ్చారు. ఐక్యమత్యంగా సంయుక్త పోరాటాన్ని సాగించాలని అన్నారు. 'బటోగేతో లుటోగే' (ఐక్యంగా లేకుంటే ఓడిపోతారు) అంటూ రైతు సంఘాలను హెచ్చరించారు. దలేవాల్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు.

Disaanayake: భారత్ సాయాన్ని మరువలేం: దిశనాయకే


పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం సహా 11 డిమాండ్లపై రైతు సంఘాలు పోరాటం సాగిస్తు్న్నాయి. ఉత్తర‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇటీవల "బటోగే తే కాటోగే'' అంటూ ఎన్నికల ప్రచారం సాగించిన క్రమంలో రైతులకు రాకేత్ టికాయత్ ఇచ్చిన నినాదం ప్రాధాన్యత సంతరించుకుంది. ఖనౌరీలో నిరాహార దీక్ష కొనసాగిస్తున్న దలేవాల్‌ను టికాయత్ గత వారంలో కలుసుకున్నారు. 70 ఏళ్ల కేనర్స్ పేషెంట్ అయిన దలేవాల్ నవంబర్ 26వ తేదీ నుంచి పంజాబ్-హర్యానా కనౌరి సరిహద్దు ప్రాంతం వద్ద ఆమరణ దీక్షలో ఉన్నారు. పంటల కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీ కల్పించడం సహా రైతుల డిమాండ్లను కేంద్రం అంగీకరించాలంటూ దలేవాల్ ఆమరణ దీక్షకు దిగారు.


మరోవైపు, సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా ఆధ్వర్యంలో రైతులు చేపట్టిన ఢిల్లీ చలో మార్చ్‌‌కు పోలీసుల ప్రతిఘటన ఎదురుకావడంతో ఫిబ్రవరి 13 నుంచి శంభు, ఖనౌరి సరిహద్దు పాయింట్ల వద్దే రైతులు నిలిచిపోయారు. ఇటీవల మూడుసార్లు ఢిల్లీ చలో మార్చ్‌ను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. కాగా, రైతు సంస్థలు పంజాబ్ నుంచో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌ నుంచే ఎవరికి వారు ఢిల్లీ చలో మార్చ్‌ పిలుపు ఇస్తే ఆశించిన ఫలితాలు రావని, రైతు సంఘాలన్నీ సమష్టిగా వ్యూహరచన చేయాలని తికాయత్ తాజాగా పిలుపునిచ్చారు.


ట్రాక్టర్ మార్చ్, రైల్ రోకో

కాగా, ఖనౌరి, శంభు సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా హర్యానా రైతులు సోమవారంనాడు ట్రాక్టర్ మార్చ్ నిర్వహించారు. దలేవాల్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. డిసెంబర్ 18వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకూ 'రైల్ రోకో' నిరసనకు రైతు నేత శర్వణ్ సింగ్ పంథేర్ పిలుపునిచ్చారు.


ఇవి కూడా చదవండి...

Priyanka Gandhi: ఇలా బ్యాగ్‌తో వచ్చి అలా వివాదంలోకి చిక్కి

Rahul Gandhi: సోనియా స్పందించ లేదు.. మీరైనా స్పందించండి.. రాహుల్‍కు లేఖ

Nirmala Sitharaman: కాంగ్రెస్ హయాంలో అంతా జైళ్లలోనే..

Updated Date - Dec 16 , 2024 | 09:18 PM