Share News

Ram Mandir: అయోధ్య చేరిన 1265 కిలోల లడ్డు, ప్రపంచంలో అతి పెద్ద గడియారం

ABN , Publish Date - Jan 20 , 2024 | 11:46 AM

అయోధ్యలో రామ్ లల్లా (బాలరాముడి) ప్రాణ ప్రతిష్ఠ సోమవారం రోజున జరగనుంది. రామ్ లల్లాకు బహుమతిగా వివిధ ప్రాంతాల నుంచి జ్ఞాపికలు వస్తున్నాయి. బాలరాముడి కోసం 1265 కిలోల లడ్డు ప్రసాదం అయోధ్యకు చేరింది.

 Ram Mandir: అయోధ్య చేరిన 1265 కిలోల లడ్డు, ప్రపంచంలో అతి పెద్ద గడియారం

అయోధ్య: అయోధ్యలో రామ్ లల్లా (బాలరాముడి) ప్రాణ ప్రతిష్ఠ సోమవారం రోజున జరగనుంది. అయోధ్యకు (Ayodhya) వచ్చే భక్తులకు ఇబ్బంది కలుగకుండా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. రామ్ లల్లాకు బహుమతిగా వివిధ ప్రాంతాల నుంచి జ్ఞాపికలు వస్తున్నాయి. బాలరాముడి కోసం 1265 కిలోల లడ్డు ప్రసాదం అయోధ్యకు చేరింది. లడ్డు ప్రసాదం హైదరాబాద్ నుంచి వచ్చింది. రామ్ లల్లా ప్రాణప్రతిష్ఠ రోజున ఆ ప్రసాదం భక్తులకు పంపిణీ చేస్తారు. ఆలయానికి వేసే భారీ తాళం అలీగఢ్ నుంచి వచ్చింది. ఆ తాళం బరువు 400 కిలోలు ఉంది.

25 మంది సిబ్బంది

1265 కిలోల లడ్డు ప్రసాదాన్ని హైదరాబాద్‌కు చెందిన శ్రీరామ్ క్యాటరింగ్ సర్వీసెస్ తయారు చేసింది. 25 మంది సిబ్బంది లడ్డు ప్రసాదం తయారీలో పాల్గొన్నారు. ప్రసాదం నెలరోజుల పాటు నిల్వ ఉంటుందని క్యాటరింగ్ యజమాని నాగభూషణ్ రెడ్డి చెబుతున్నారు. ‘తన కుటుంబాన్ని, వ్యాపారాన్ని ఆ దేవుడు చల్లగా దీవించాడు. ఇక రోజు కిలో లడ్డూ తయారు చేస్తా. జీవించి ఉన్నంత కాలం ప్రసాదం తయారు చేస్తానని’ నాగభూషణ్ రెడ్డి తెలిపారు.

భారీ తాళం

భారీ తాళం తయారీని రెండేళ్ల క్రితం సత్య ప్రకాశ్ శర్మ, రుక్మిణి శర్మ దంపతులు ప్రారంభించారు. ఆ దంపతుల స్వస్థలం అలీగఢ్‌లో గల నోరంగాబాద్‌. తాళం తయారీ ఇటీవల పూర్తి అయ్యింది. అంతలోనే ప్రకాశ్ శర్మ చనిపోయారు. అయోధ్య ఆలయానికి తాళం అందజేయాలనేది అతని చివరి కోరిక. ఆ కోరికను భార్య రుక్మిణి తీర్చారు. నొరంగబాద్ నుంచి ప్రత్యేక వాహనంలో తాళాన్ని అయోధ్య తీసుకొచ్చారు. అయోధ్యలో క్రేన్ ద్వారా తాళం బయటకు తీస్తుండగా అక్కడున్న వారంతా జై శ్రీరామ్ అని గట్టిగా నినాదించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 20 , 2024 | 11:46 AM