Ravneet Singh : రాహుల్ నంబర్ వన్ ఉగ్రవాది
ABN , Publish Date - Sep 16 , 2024 | 03:45 AM
లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ ఇటీవలి అమెరికా పర్యటనలో సిక్కులపై చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టు మండిపడ్డారు.
రాహుల్ సిక్కు వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కన్నెర్ర
రాహుల్ భారతీయుడే కాదన్న రవ్‌నీత్ సింగ్ బిట్టు
న్యూఢిల్లీ, సెప్టెంబరు 15: లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ ఇటీవలి అమెరికా పర్యటనలో సిక్కులపై చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టు మండిపడ్డారు. ఎప్పుడూ విదేశాల్లో గడిపే రాహుల్ అసలు భారతీయుడే కాదన్నారు. రాహుల్ వ్యాఖ్యలను ఉగ్రవాదులు అభినందిస్తున్నారంటే ఆయనకంటే పెద్ద ఉగ్రవాది లేరని బిట్టూ చెప్పారు. రాహుల్‌ను పట్టించిన వారికి రివార్డ్ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. భారత్‌లో సిక్కులను తలపాగా ధరించేందుకు, గురుద్వారాకు వెళ్లేందుకు అనుమతించాలా, వద్దా, అనే అంశంపై పోరాటం జరుగుతోందని రాహుల్ ఇటీవలి అమెరికా పర్యటనలో వ్యాఖ్యానించారు. అన్ని మతస్థులదీ ఇదే పరిస్ధితి అని రాహుల్ చెప్పారు. ఈ మాటలను తప్పుబట్టిన కేంద్ర మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టు లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు.