Shaktikanta Das: అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన ఆర్బీఐ గవర్నర్
ABN , Publish Date - Nov 26 , 2024 | 08:04 PM
ఎసిడిటీతో ఆసుపత్రిలో చేరిన శక్తికాంత్ దాస్ ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారని, మరో కొద్ది గంటల్లో డిశ్చార్చ్ అవుతారని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని ఆర్బీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు.
చెన్నై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ (Shaktikanta Das) స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో మంగళవారం ఉదయం చేరారు. కడుపులో మంట (Acidity) లక్షణాలు కనిపించడంతో వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రిలో చేరినట్టు ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది.
Atishi: ఓటర్ల జాబితా తారుమారుకు బీజేపీ కుట్ర.. సీఎం సంచలన ఆరోపణ
ఎసిడిటీతో ఆసుపత్రిలో చేరిన శక్తికాంత దాస్ ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారని, మరో కొద్ది గంటల్లో డిశ్చార్చ్ అవుతారని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని ఆర్బీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు.
శక్తికాంత దాస్ మరో ఇన్నింగ్స్
కాగా, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పదవీ కాలాన్ని మరో విడత పొడిగించాలనే ఆలోచనలో కేంద్రం ఉన్నట్టు 'రాయిటర్స్' సంస్థ తెలిపింది. అదే జరిగితే 1960 నుంచి ఆర్బీఐ గవర్నర్‌గా ఎక్కువ కాలం సేవలందించిన ఘనత శక్తికాంత దాస్‌కు దక్కుతుంది. 2018లో ఆయన ఆర్బీఐ గవర్నర్‌గా బాధ్యతలు తీసుకున్నారు. సెంట్రల్ బ్యాంక్‌కు, ప్రభుత్వానికి మధ్య టెన్షన్ నెలకొన్న తరుణంలో ఆయన ఆర్బీఐ స్థిరత్వానికి కీలక పాత్ర పోషించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సాన్నిహిత్యం కలిగిన వ్యక్తిగా ఆయనకు మంచి పేరుంది. శక్తికాంత్ సారథ్యంలో ఆర్బీఐ పలు ఆర్థిక సవాళ్లను సమర్ధవంతంగా ఎదుర్కొంది. ఆయన ప్రస్తుత పదవీకాలం డిసెంబర్ 10వ తేదీతో ముగియనుంది.
ఇవి కూడా చదవండి..
Maharashtra: 'మహా' సర్కార్ ప్రమాణస్వీకారం ముహూర్తం ఇదేనట
President Droupadi Murmu: ప్రత్యక్ష, ప్రగతిశీల పత్రమే.. ‘‘రాజ్యాంగం’’
Dy CM: మళ్లీ ద్రావిడ పాలన కోసం పాటుపడండి..
Read More National News and Latest Telugu News