Remal Cyclone: రెమాల్ తుపాను బీభత్సం..నేలకూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు
ABN , Publish Date - May 27 , 2024 | 08:43 AM
బంగాళాఖాతంలో ఉద్భవించిన రెమాల్ తుపాను(Remal Cyclone) ఆదివారం రాత్రి బెంగాల్ తీరాన్ని తాకింది. దీంతో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. బలమైన గాలులు వీచిన కారణంగా పలు ప్రాంతాల్లో చెట్లు కూడా నేలకొరిగాయి. తుపాను కారణంగా కోల్‌కతా, నార్త్ 24 పరగణాలతో సహా పశ్చిమ బెంగాల్‌లోని ఇతర నగరాల్లో భారీ వర్షం కురిసింది.
బంగాళాఖాతంలో ఉద్భవించిన రెమాల్ తుపాను(Remal Cyclone) ఆదివారం రాత్రి బెంగాల్ తీరాన్ని తాకింది. దీంతో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. బలమైన గాలులు వీచిన కారణంగా పలు ప్రాంతాల్లో చెట్లు కూడా నేలకొరిగాయి. తుపాను కారణంగా కోల్‌కతా, నార్త్ 24 పరగణాలతో సహా పశ్చిమ బెంగాల్‌లోని ఇతర నగరాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాల్లో చెట్లు రోడ్లపై నేలకూలగా, మరికొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలు పడిపోయి కరెంట్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
అలాగే సుందర్‌బన్‌లోని గోసాబా ప్రాంతంలో శిథిలాలు పడి ఒక వ్యక్తి గాయపడ్డాడు. కోల్‌కతాకు ఆనుకుని ఉన్న లోతట్టు ప్రాంతాల్లోని రోడ్లు, ఇళ్లు జలమయమయ్యాయి. రెస్క్యూ, విపత్తు నిర్వహణ బృందం రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు.
తుపాను తీరం దాటడంతో బెంగాల్(West Bengal), ఉత్తర ఒడిశా, అస్సాం, మేఘాలయలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. మరోవైపు మే 27-28 తేదీల్లో మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, త్రిపురలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. వాతావరణ శాఖ ప్రకారం తుఫాను తీరం దాటే సమయంలో గాలి గంటకు 135 కిలోమీటర్ల వేగంతో వీచింది. ఈ క్రమంలో రెమాల్ పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ ద్వీపం, బంగ్లాదేశ్‌లోని ఖేపడా మధ్య తీరాన్ని తాకింది.
వాతావరణ శాఖ ప్రకారం తుపాను(Remal Cyclone) ప్రస్తుతం బలహీనపడింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి. ఉత్తర బంగాళాఖాతంపై తీవ్ర తుఫాను 'రెమాల్' గత 6 గంటల్లో గంటకు 13 కిమీ వేగంతో ఉత్తరం వైపు కదిలిందని వెదర్ రిపోర్ట్ తెలిపింది. ఈ నేపథ్యంలో మే 27 ఉదయం నాటికి రెమాల్ క్రమంగా బలహీనపడి తుపానుగా మారుతుందని వెల్లడించింది. మరో 2 గంటల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని అంచనా.
ఇది కూడా చదవండి:
Kaviya Maran: సన్ రైజర్స్ ఓటమితో కన్నీరు పెట్టుకున్న కావ్య పాప..వీడియో వైరల్
IPL 2024: ఐపీఎల్ 2024లో గెలిచిన.. ఓడిన జట్లకు ఎంత మనీ వస్తుంది..?
Read Latest National News and Telugu News