Share News

Sunil Ambekar: కుల గణనపై క్లారిటీ ఇచ్చిన ఆర్ఎస్ఎస్

ABN , Publish Date - Sep 02 , 2024 | 08:08 PM

కుల గణనపై దేశవ్యాప్తంగా కీలక చర్చ జరుగుతుంది. అలాంటి వేళ.. కుల గణనపై బీజేపీ అనుబంధ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) స్పష్టత ఇచ్చింది. కుల గణన అనేది సున్నితమైన అంశమని పేర్కొంది. ఈ అంశం సామాజిక వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా ఉండాలని తెలిపింది.

 Sunil Ambekar: కుల గణనపై క్లారిటీ ఇచ్చిన ఆర్ఎస్ఎస్
RSS publicity in-charge Sunil Ambekar

తిరువనంతపురం, సెప్టెంబర్ 02: కుల గణనపై దేశవ్యాప్తంగా కీలక చర్చ జరుగుతుంది. అలాంటి వేళ.. కుల గణనపై బీజేపీ అనుబంధ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) స్పష్టత ఇచ్చింది. కుల గణన అనేది సున్నితమైన అంశమని పేర్కొంది. ఈ అంశం సామాజిక వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా ఉండాలని తెలిపింది. అంతే కానీ ఎన్నికల్లో లబ్ది పొందేందు ఈ అంశం రాజకీయ సాధనంగా పరిగణించకూడదని అభిప్రాయం వ్యక్తం చేసింది. కుల గణన సేకరణకు ఆర్ఎస్ఎస్ మద్దతు ఇస్తుందని ఈ సందర్భంగా తెలిపింది.

Also Read: Uttar Pradesh: గజ ఈతగాడి దురాశకు నిండు ప్రాణం బలి


కేరళలోని పాలక్కాడ్‌లో ఆర్ఎస్ఎస్.. అఖిల భారతీయ సమన్వయ సదస్సు మూడు రోజుల పాట జరిగింది. ఈ సందర్భంగా ఈ సదస్సులో కుల గణనకు సంబంధించిన అన్ని అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా కుల గణన అంశంపై ఆర్ఎస్ఎస్ ప్రచార వ్యవహారాల బాధ్యుడు సునీల్ అంబేకర్ మాట్లాడారు. కుల గణనకు తాము అనుకూలమన్నారు. ఈ కుల గణనను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. మన సమాజంతో కులాలు పెనవేసుకు పోయాయని.. ఇది చాలా సున్నితమైన అంశమని పేర్కొన్నారు.

Also Read: Heavy Rains: ఉన్నతాధికారులతో మంత్రులు అచ్చెన్నాయుడు, లోకేశ్ కీలక సమీక్ష


ఇది జాతీయ సమైక్యతకు అద్దం పడుతుందని చెప్పారు. కానీ ఈ కుల గణనను ఎన్నికల కోసం వినియోగించడంపై ఆయన తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. విధానాల రూపకల్పనకు, అట్టడుగు వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించేందుకు మాత్రం ఈ అంశం ప్రయోజనకారిగా దోహద పడుతుందన్నారు. అంటే దేశ, సమాజ సంక్షేమం కోసం ఈ కుల గణనను ఉపయోగించాలని సునీల్ అంబేకర్ అభిప్రాయపడ్డారు.

Also Read: Miyapur Police: ద్విచక్ర వాహనాల చోరీ ముఠా గుట్టు రట్టు చేసిన పోలీసులు


ఈ కుల గణనను మరో విధంగా వినియోగిస్తే మాత్రం దుష్పలితాలకు అస్కారం కల్పించిన వారమవుతామని హెచ్చరించారు. ఇంకా సోదాహరణగా చెప్పాంటే మాత్రం.. అది సామాజిక విభజనకు దారి తీస్తుందని ఈ సందర్భంగా ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

Also Read:Toopran: గురుకుల పాఠశాలలో మళ్లీ విద్యార్థుల మధ్య ఘర్షణ


ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు కుల గణనపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరిగింది. ఈ ఎన్నికల ముందే కుల గణన జరపాలని ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, సమాజవాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్‌లు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన విషయం విధితమే. అలాంటి వేళ.. కుల గణనపై బీజేపీ అనుబంధ సంస్థ ఆర్ఎస్ఎస్ తమ అభిప్రాయాన్ని ఇలా వ్యక్తం చేసింది. దీంతో ఈ అంశంపై ఆర్ఎస్ఎస్ వైఖరి ఏమిటన్నది సుస్పష్టమైనట్లు అయింది.

Also Read: Heavy Rains: ఉన్నతాధికారులతో మంత్రులు అచ్చెన్నాయుడు, లోకేశ్ కీలక సమీక్ష

Read More National News and Latest Telugu New

Updated Date - Sep 02 , 2024 | 08:14 PM