Share News

RG Kar Case: నిందితుడు పేరు చార్జీషీట్‌లో స్పష్టం చేసిన సీబీఐ

ABN , Publish Date - Oct 07 , 2024 | 07:05 PM

ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో డ్యూటీలో ఉన్న ట్రైయినీ వైద్యురాలి హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ హత్యాచారానికి సంజయ్ రాయ్ పాల్పడినట్లు సీబీఐ ఆరోపించింది. అందుకు సంబంధించిన అభియోగ పత్రాన్ని సోమవారం సల్దాలోని ప్రత్యేక కోర్టులో సీబీఐ దాఖలు చేసింది.

RG Kar Case: నిందితుడు పేరు చార్జీషీట్‌లో స్పష్టం చేసిన సీబీఐ

కోల్‌కతా, అక్టోబర్ 07: ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో డ్యూటీలో ఉన్న ట్రైయినీ వైద్యురాలి హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ హత్యాచారానికి సంజయ్ రాయ్ పాల్పడినట్లు సీబీఐ ఆరోపించింది. అందుకు సంబంధించిన అభియోగ పత్రాన్ని సోమవారం సల్దాలోని ప్రత్యేక కోర్టులో సీబీఐ దాఖలు చేసింది. ఈ ఘటనలో దాదాపు 200 మంది నుంచి సీబీఐ వాంగ్మూలాన్ని సేకరించింది. అనంతరం ట్రైయినీ వైద్యురాలిపై హత్యాచారానికి పాల్పడింది సంజయ్ రా‌యేనని సీబీఐ ఓ నిర్ణయానికి వచ్చింది.

Also Read: Dasara 2024: దసరా వేళ.. సామాన్యుడు ఉక్కిరి బిక్కిరి


దీంతో కోర్టులో అభియోగ పత్రాన్ని దాఖలు చేసింది. ఆగస్ట్ 9వ తేదీ తెల్లవారు జామున ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో విధుల్లో ఉన్న ట్రైయినీ వైద్యురాలు సెమినార్ హాల్లో విశ్రాంతి తీసుకుంటుంది. ఆ సమయంలో ఆమెపై నిందితుడు సంజయ్ రాయ్ హత్యాచారానికి పాల్పడ్డారని సీబీఐ అధికారులు వెల్లడించారు. అయితే ఆ ఘటనలో సదరు వైద్యురాలిపై సామూహిక లైంగిక దాడి జరిగినట్లు ఆరోపణలు వెల్లవెత్తాయి.

Also Read: Dasara Navaratri 2024: ఆరో రోజు.. ఈ అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్న అమ్మ వారు


ఆగస్ట్ 9వ తేదీ తెల్లవారుజామున 31 ఏళ్ల ట్రైయినీ వైద్యురాలు సామూహిక అత్యాచారానికి గురైంది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో వైద్య సిబ్బంది ఆందోళన బాట చేపట్టారు. ఈ కేసులో నిందితులు ఎవరో తేల్చాలని.. అలాగే పని ప్రదేశాల్లో వైద్యులకు రక్షణ చర్యలు కల్పించాలంటూ జూనియర్ డాక్టర్లు ఆందోళన బాట పట్టారు. ఆ క్రమంలో పలు డిమాండ్లను మమతా బెనర్జీ ప్రభుత్వం ఎదుట ఉంచారు. అందులో కొన్నింటింని నెరవేర్చేందుకు సిద్దమైంది.

Also Read: Batti Vikramarka: ప్రజా అజెండా తప్పా.. వ్యక్తిగత అజెండా లేదు


దీంతో పాక్షికంగా విధులు నిర్వహించేందుకు సిద్దమయ్యారు. అయితే దాదాపు 10 రోజుల అనంతరం తమ డిమాండ్ల పట్ల మమతా బెనర్జీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందంటూ జూనియర్ డాక్టర్లు ఆరోపించారు. ఈ నేపథ్యంలో తాము నిరవధిక ఆందోళనకు దిగుతున్నట్లు వారు స్పష్టం చేశారు. మరోవైపు ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌ను ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

Also Read: Amith Shah: ముగిసిన భేటీ.. మావోయిస్టులపై కీలక వ్యాఖ్యలు


ఆయన ప్రిన్సిపల్‌గా ఉండగా.. మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ఆర్థిక అవకతవకలు జరిగడంతోపాటు వైద్య విద్యార్థిని హత్యాచార ఘటన అనంతరం అక్కడి అధారాలను సైతం మాయం చేసినట్లు సందీప్ ఘోష్‌పై ఆరోపణలు వెల్లువెత్తాయి. దాంతో ప్రొ. సందీప్ ఘోష్‌ను ఈడీ విచారిస్తున్న సంగతి తెలిసిందే.

Also Read: మోకాళ్ల నొప్పులు తగ్గాలంటే.. ఇవి తీసుకోకండి..

For National News And Telugu News...

Updated Date - Oct 07 , 2024 | 07:05 PM