Sankranti: సంక్రాంతికి అన్‌రిజర్వుడు ప్రత్యేక రైళ్లు.. ఎక్కడినుంచి ఎక్కడివరకంటే..
ABN , Publish Date - Jan 11 , 2024 | 08:30 AM
సంక్రాంతి పండుగను పురస్కరించుకొని తాంబరం నుంచి తూత్తుకుడి, తిరున ల్వేలికి అన్‌రిజర్వుడు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ రైల్వే తెలిపింది.
పెరంబూర్(చెన్నై): సంక్రాంతి పండుగను పురస్కరించుకొని తాంబరం నుంచి తూత్తుకుడి, తిరున ల్వేలికి అన్‌రిజర్వుడు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ రైల్వే తెలిపింది.
- నెం.06001 తాంబరం - తూత్తుకుడి అన్‌రిజర్వుడు స్పెషల్ ఈనెల 14, 16 తేదీల్లో ఉదయం 7.30 గంటలకు తాంబరం నుంచి బయల్దేరి రాత్రి 11.45 గంటలకు తూత్తుకుడి చేరుకుంటుంది. అలాగే, నెం.06002 తూత్తుకుడి - తాంబరం ప్రత్యేక రైలు ఈనెల 15, 17 తేదీల్లో ఉదయం 6 గంటలకు తూత్తుకుడిలో బయల్దేరి రాత్రి 8.30 గంటలకు తాంబరం చేరుకుంటుంది.
- నెం.06003 తాంబరం - తిరునల్వేలి ప్రత్యేక రైలు ఈ నెల 11, 13, 16 తేదీల్లో తాంబరంలో రాత్రి 9.50 గంటలకు బయల్దేరి మరుసటిరోజు ఉదయం 11.15 గంటలకు తిరునల్వేలి చేరుకుంటుంది. అలాగే, నెం.06004 తిరునల్వేలి - తాంబరం ప్రత్యేక రైలు ఈ నెల 12, 14, 17 తేదీల్లో తిరునల్వేలి నుంచి మధ్యాహ్నం 2.15 గంటలకు బయల్దేరి మరుసటిరోజు వేకువజామున 3.15 గంటలకు తాంబరం చేరుకుంటుంది.