Share News

Sarah Adams : తాలిబాన్లకు భారత్‌ నిధులు

ABN , Publish Date - Jul 01 , 2024 | 03:22 AM

కశ్మీరీ, ఖలిస్థానీ, పాకిస్థాన్‌ వ్యాప్తంగా దేశ వ్యతిరేక నాయకులను చంపేందుకు అఫ్ఘానిస్థాన్‌ తాలిబాన్లకు భారత్‌ 10 మిలియన్‌ డాలర్ల (రూ.83.36 కోట్లు) నిధులు..

Sarah Adams : తాలిబాన్లకు భారత్‌ నిధులు

  • కశ్మీరీ, ఖలిస్థానీ, పాక్‌ నేతలను చంపేందుకే

  • సీఐఏ మాజీ అధికారి సారా ఆరోపణలు

న్యూఢిల్లీ, జూన్‌ 30: కశ్మీరీ, ఖలిస్థానీ, పాకిస్థాన్‌ వ్యాప్తంగా దేశ వ్యతిరేక నాయకులను చంపేందుకు అఫ్ఘానిస్థాన్‌ తాలిబాన్లకు భారత్‌ 10 మిలియన్‌ డాలర్ల (రూ.83.36 కోట్లు) నిధులు సమకూరుస్తోందంటూ సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ (సీఐఏ-అమెరికా) మాజీ అధికారి సారా ఆడమ్స్‌ సంచలన ఆరోపణలు చేశారు.

ఈ నిధులను తాలిబాన్లు తెహ్రీక్‌-ఈ-తాలిబాన్‌ పాకిస్థాన్‌ (టీటీపీ)కి చేరవేస్తూ హత్యలకు పథకాలు అమలు చేస్తున్నారన్నారు. అమెరికా మాజీ నేవీ సీల్‌ అధికారి, సీఐఏ కాంట్రాక్టర్‌ షాన్‌ ర్యాన్‌ నిర్వహించిన ‘షాన్‌ ర్యాన్‌ షో’లో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

అలాగే పాక్‌కు చెందిన జమియత్‌ ఉలేమా-ఈ-ఇస్లాం (ఎఫ్‌) రాజకీయ పార్టీకి తాలిబాన్లు, అల్‌ఖైదా రెండింటితోనూ సంబంధాలున్నాయని.. వారు పాక్‌లోని ఫెడరల్లీ అడ్మినిస్ట్రేడ్‌ ట్రైబల్‌ ఏరియాస్‌ (ఎఫ్‌ఏటీఏ) ను స్వాధీనం చేసుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని వెల్లడించారు. ఆడమ్స్‌ వ్యాఖ్యలను ఎవరూ ధ్రువీకరించనప్పటికీ.. ఆమె నేపథ్యాన్ని బట్టి లేవనెత్తిన అంశాలపై విచారణకు దారితీసే అవకాశం లేకపోలేదు.

Updated Date - Jul 01 , 2024 | 03:23 AM