Share News

Supreme court: మోదీపై వ్యాఖ్యలు.. శిశథరూర్‌కు స్వల్ప ఊరట

ABN , Publish Date - Oct 14 , 2024 | 05:01 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీని శివలింగంపై "తేలు''తో పోలుస్తూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన పరువునష్టం కేసులో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌ కు సుప్రీంకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది.

Supreme court: మోదీపై వ్యాఖ్యలు.. శిశథరూర్‌కు స్వల్ప ఊరట

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీని శివలింగంపై "తేలు''తో పోలుస్తూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన పరువునష్టం కేసులో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌ (Shashi Tharoor)కు సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట లభించింది. కేసు ప్రొసీడింగ్స్‌పై తాత్కాలిక స్టేను అత్యున్నత న్యాయస్థానం పొడిగించింది. నాలుగు వారాల్లోగా తమ స్పందన తెలియజేయాలని ఢిల్లీ పోలీసులు, ఫిర్యాదుదారుడికి న్యాయమూర్తులు హృషికేష్ రాయ్, ఎస్‌వీఎన్ భట్టితో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. పరువునష్టం కేసు విచారణపై ఉన్న తాత్కాలిక స్టేను పొడిగిస్తున్నట్టు చెప్పింది.

Uddhav Thackeray: ఆసుపత్రిలో చేరిన మాజీ సీఎం


శశిథరూర్‌కు వ్యతిరేకంగా క్రిమినల్ ప్రొసీడింగ్స్‌‌పై గత సెప్టెంబర్‌ 10న సుప్రీంకోర్టు తాత్కాలిక స్టే ఇచ్చింది. తనపై వేసిన పరువునష్టం కేసును కొట్టివేయాలంటూ శశిథరూర్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఆగస్టు 29న హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. క్రిమినల్ డిఫమేషన్ ఫిర్యాదులో తనను నిదింతుడిగా పేర్కొంటూ 2019 ఏప్రిల్ 27న విచారణ కోర్టు సమన్లను కొట్టివేయాలని థరూర్ కోరారు. శశిథరూర్ చేసిన వ్యాఖ్యలు తన మతపరమైన మనోభావాలను దెబ్బతీశాయంటూ బీజేపీ నేత బబ్బర్ విచారణ కోర్టులో ఫిర్యాదు చేశారు.


బబ్బర్‌కు సుప్రీం నోటీసు

కాగా, తాజాగా నాలుగు వారాల్లోగా తన స్పందన తెలియజేయాలంటూ ఫిర్యాదుదారు బబ్బర్‌కు సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. ఢిల్లీ పోలీసులను కూడా తమ సమాధానం తెలియజేయాలని ఆదేశిస్తూ, నాలుగు వారాల తర్వాత ఆ అంశంపై విచారణ తేదీని ఖరారు చేస్తామని తెలిపారు. శశిథరూర్ గతంలో బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, మోదీని శివలింగంపై తేలులా ఆర్ఎస్ఎస్ వారు భావిస్తుంటారనీ, ఆ తేలును చేతితో తీసివేయలేం, చెప్పుతో కొట్టలేమని అనుకుంటారని అన్నారు. దీనిపైనే రాజీవ్ బబ్బర్ పరువునష్టం కేసు వేశారు.


మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..

ఇది కూడా చదవండి..

‘ఆయుష్మాన్‌’లో వృద్ధులకు మరిన్ని ప్రయోజనాలు

Updated Date - Oct 14 , 2024 | 05:01 PM