Share News

Maha Vikas Aghadi: నేడు జోడి మారో ర్యాలీ.. స్పందించిన బీజేపీ

ABN , Publish Date - Sep 01 , 2024 | 11:17 AM

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు మరికొద్ది రోజుల్లో ముహుర్తం ఖరారు కానుంది. అలాంటి వేళ.. అధికారం అందుకోవాలని రాజకీయ పార్టీలు వడివడిగా అడుగులు వేస్తున్నాయి. సరిగ్గా అలాంటి వేళ.. సింధుదుర్గ్ జిల్లాలోని మల్వానీలో ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిన ఘటనను పలు రాజకీయ పార్టీలు అస్త్రంగా మలుచుకున్నాయి.

Maha Vikas Aghadi: నేడు జోడి మారో ర్యాలీ.. స్పందించిన బీజేపీ

ముంబయి, సెప్టెంబర్ 01: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు మరికొద్ది రోజుల్లో ముహుర్తం ఖరారు కానుంది. అలాంటి వేళ.. అధికారం అందుకోవాలని రాజకీయ పార్టీలు వడివడిగా అడుగులు వేస్తున్నాయి. సరిగ్గా అలాంటి వేళ.. సింధుదుర్గ్ జిల్లాలోని మల్వానీలో ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిన ఘటనను పలు రాజకీయ పార్టీలు అస్త్రంగా మలుచుకున్నాయి. ఈ ఘటనకు నిరసనగా మహా వికాస్ అఘాడీలోని రాజకీయ పార్టీలు ఆదివాకం ముంబయి మహానగరంలో ‘జోడి మారో’ పేరిట భారీ ర్యాలీ నిర్వహించనున్నాయి.

Madhya Pradesh: రూ. 11 కోట్ల విలువైన యాపిల్ ఐఫోన్లు చోరీ


గేట్ వే ఆఫ్ ఇండియా వరకు..

హుతాత్మ చౌక్ నుంచి గేట్ వే ఆఫ్ ఇండియా వద్దనున్న ఛత్రపతి శివాజీ విగ్రహం వరకు ఈ జోడి మారో ర్యాలీని చేపట్టనున్నాయి. ఈ ర్యాలీలో మహా వికాస్ అఘాడీ కూటమిలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్) అధినేత శరద్ పవార్, శివసేన (యూబీటీ) ఉద్దవ్ ఠాక్రే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాధ్యక్షుడు నాన పొటెలే పాల్గొనున్నారు. ఈ సందర్బంగా ఆ యా పార్టీలు ఎక్స్ వేదికగా స్పందించాయి. మహారాష్ట్ర గౌరవాన్ని మేల్కొల్పండంటూ శివసేన యూబీటీ స్పందించింది. అవినీతి శివద్రోహులకు క్షమాపణ లేదని శరద్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీ పేర్కొంది. శివద్రోహులకు గుణపాఠం చెప్పడం కోసమే ఈ భారీ ర్యాలీ అని మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వివరించింది.

Also Read: Haryana Assembly Elections: బీజేపీపై గెలుపునకు కాంగ్రెస్ వినూత్న ప్రచారం


ప్రధాని మోదీ చేతుల మీదగా ఆవిష్కరణ.. అంతలోనే..

సింధుదుర్గ్ జిల్లాలోని మల్వానీలో రాజ్‌కోట్ కోట వద్ద ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని గతేడాది అంటే.. 2023, డిసెంబర్ 4వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదగా ఆవిష్కరించారు. ఈ విగ్రహావిష్కరణ జరిగిన కేవలం 8 నెలలకే ఆ విగ్రహం కూలిపోయింది. ఈ ఘటనపై సర్వత్ర విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి. ఈ విగ్రహా ఏర్పాటులో భారీ కుంభకోణం చోటు చేసుకుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

Also Read: Mumbai Police: ఇరికిద్దామనుకున్నారు... ఇరుక్కుపోయారు..


స్పందించిన సీఎం షిండే..

దీంతో సీఎం ఏకనాథ్ షిండే స్పందించారు. విగ్రహా ఏర్పాటు భారత నేవి ఏర్పాటు చేసిందని స్పష్టం చేశారు. అలాగే రెండు కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఒకటి విగ్రహం ఎందుకు కూలిందనే? అంశంపై విచారణ జరుపుతుందన్నారు. సాధ్యమైనంత త్వరగా అదే స్థానంలో శివాజీ విగ్రహం ఏర్పాటు చేసేందుకు మరో కమిటీ పని చేస్తుందన్నారు.

ఈ రెండు కమిటీలు యుద్ద ప్రాతిపదికన పని చేస్తాయని తెలిపారు. మరోవైపు ఈ విగ్రహం కూలిన ఘటనలో విగ్రహం ఏర్పాటు చేసిన వారిపై హత్య కేసు నమోదు చేయాలని సీఎం శిండే ఆదేశించారు. దీంతో చేతన్ పటేల్‌ను అరెస్ట్ చేశారు. విగ్రహం శిల్పి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.


రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటన..

ఇటీవల మహారాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటనలో భాగంగా ఈ అంశంపై స్పందించారు. ఛత్రపతి శివాజీ ఒక మహారాజు మాత్రమే కాదన్నారు. ఆయన మనందరికి దేవుడితో సమానమన్నారు. శివాజీ విగ్రహం కూలిన ఘటన తనను తీవ్రంగా కలిచి వేసిందని చెప్పారు. ఆయన పాదాల వద్ద తన తల ఉంచి క్షమాపణలు కోరుతున్నానన్నారు. ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిన ఘటనపై మహారాష్ట్రలోని అధికార పార్టీ నేతలు ఇప్పటికే క్షమాపణలు తెలిపిన సంగతి తెలిసిందే.


ర్యాలీపై స్పందించిన బీజేపీ.. భారీగా మోహరించిన పోలీసులు

ఇక ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షమైన మహా వికాస్ అఘాడీ ఆదివారం ర్యాలీ చేపట్టడంపై బీజేపీ ఘాటుగా స్పందిందించి. ఎన్నికల వేళ.. మహా వికాస్ అఘాడీ చేస్తున్న ఈ ర్యాలీ రాజకీయ ప్రేరేపితమంది. ఇది అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఆ కూటమి చేస్తున్న ఎన్నికల జిమ్మిక్కుగా బీజేపీ అభివర్ణించింది. ఈ రోజు ప్రతిపక్షం భారీ ర్యాలీ నేపథ్యంలో ముంబయిలో భారీగా పోలీసులను మోహరించింది.

Read More National News and Latest Telugu New

Updated Date - Sep 01 , 2024 | 11:18 AM