Lok Sabha Polls: మాజీ సీఎంను పక్కన పెట్టిన బీజేపీ.. అసలు కారణం అదేనా..?
ABN , Publish Date - Apr 04 , 2024 | 10:54 AM
బీజేపీలో ప్రస్తుతం ఉన్న సీనియర్ నేతల్లో శివరాజ్ సింగ్ చౌహన్ ఒకరు. మధ్యప్రదేశ్‌లో బీజేపీని అధికారంలోకి తీసుకురావడంలో ఆయన పాత్ర కీలకం. గత రెండు దశాబ్ధాలుగా మధ్యప్రదేశ్‌లో ఏ ఎన్నిక జరిగినా ఆయన సభలు ఉండాల్సిందే. అలాంటిది ఈ ఎన్నికల్లో ఆయన ఒక లోక్‌సభ స్థానానికే పరిమితం చేశారనే వార్తలు వస్తున్నాయి.
బీజేపీ(BJP)లో ప్రస్తుతం ఉన్న సీనియర్ నేతల్లో శివరాజ్ సింగ్ చౌహన్ ఒకరు. మధ్యప్రదేశ్‌లో బీజేపీని అధికారంలోకి తీసుకురావడంలో ఆయన పాత్ర కీలకం. గత రెండు దశాబ్ధాలుగా మధ్యప్రదేశ్‌లో ఏ ఎన్నిక జరిగినా ఆయన సభలు ఉండాల్సిందే. అలాంటిది ఈ ఎన్నికల్లో ఆయన ఒక లోక్‌సభ స్థానానికే పరిమితం చేశారనే వార్తలు వస్తున్నాయి. అసెంబ్లీ నుంచి లోక్‌సభ ఎన్నికల వరకు ఎక్కడ ఎన్నికలు జరిగినా పదుల సంఖ్యలో చౌహాన్ సభలు ఉండేవి. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోనూ శివరాజ్‌సింగ్ చౌహాన్‌తో ఒక్క సమావేశాన్ని నిర్వహించలేదు. ఆయన విదిశలో మాత్రమే ప్రచారం చేస్తున్నారు. భోపాల్‌లో ఇప్పటి వరకు ఎలాంటి సభలు, రోడ్‌షో నిర్వహించలేదు. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత శివరాజ్ సింగ్ చౌహాన్ మొదట చింద్వారాకు వెళ్లారు. ఇక్కడ లోక్‌సభ స్థానాన్ని గెలిపించి.. ప్రధాని మోదీకి బహుమతిగా ఇస్తానన్నారు. విదిశతో తనకు ఆత్మీయ అనుబంధం ఉందని, ఎన్నికల ప్రచారానికి రావాల్సిన అవసరం లేదని విదిశ ప్రజలు చెబుతున్నారని చౌహన్ తెలిపారు.
Uttar Pradesh: యూపీలో బీజేపీ కూటమి హవా.. తేలిపోనున్న ఎస్పీ: ఇండియా టీవీ సర్వే
ఐదుసార్లు ఎంపీగా..
మాజీ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ విదిశ నుంచి ఐదుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఛింద్వారాలో బీజేపీ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసినప్పుడు సీఎం మోహన్ యాదవ్, రాష్ట్ర అధ్యక్షులు విష్ణుదత్త్ శర్మ, కైలాష్ విజయవర్గియా, ప్రహ్లాద్ పటేల్ వంటి నేతలు హాజరైనప్పటికీ శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను పార్టీ ఆహ్వానించకపోవడం చర్చనీయాంశమైంది. దీంతో చౌహన్‌ను బీజేపీ పక్కన పెట్టిందనే ప్రచారం జోరందుకుంది.
అసెంబ్లీ ఎన్నికల్లో..
మధ్యప్రదేశ్‌లో గత ఏడాది జరిగిన 2023 అసెంబ్లీ ఎన్నికల్లో శివరాజ్ సింగ్ చౌహాన్ 165 సభల్లో ప్రసంగించారు. ప్రతి అభ్యర్థి శివరాజ్ సింగ్ చౌహాన్ తన ప్రాంతంలో కనీసం ఒక సమావేశాన్ని నిర్వహించాలని కోరుకున్నారు. ఫలితాలు బీజేపీకి అనుకూలంగా రావడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే శివరాజ్‌సింగ్ స్థానంలో సీఎంగా మోహన్ యాదవ్‌ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే.
Congress: సీటు పోటు.. సంజయ్ నిరుపమ్‌పై సస్పెన్షన్ వేటు..?
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..