Telugu States: వరద నష్టంపై నివేదిక అందజేత
ABN , Publish Date - Sep 11 , 2024 | 07:09 PM
తెలుగు రాష్ట్రాల్లో జరిగిన వరద నష్టాన్ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వివరించారు. బుధవారం న్యూడిల్లీలో తెలుగు రాష్ట్రాల వరద నష్టానికి సంబంధించిన ప్రాథమిక నివేదికను హోం మంత్రి అమిత్ షాకు వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అందజేశారు.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: తెలుగు రాష్ట్రాల్లో జరిగిన వరద నష్టాన్ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వివరించారు. బుధవారం న్యూడిల్లీలో తెలుగు రాష్ట్రాల వరద నష్టానికి సంబంధించిన ప్రాథమిక నివేదికను హోం మంత్రి అమిత్ షాకు వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అందజేశారు. ఈ విషయాన్ని మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తన ఎక్స్ ఖాతా వేదికగా వెల్లడించారు.
Also Read: Kolkata: సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్‌పై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం
ఎడ తెరపి లేకుండా కురిసిన భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లో వరద నీరు పోటెత్తింది. దీంతో తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి కృష్ణా జిల్లా అతలాకుతలమయ్యాయి. దీంతో ఆ యా జిల్లాలోని పలు ప్రాంతాలు జలదిగ్బందనంలో చిక్కుకున్నాయి. పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి. వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. దాంతో వారిని పునరావాస కేంద్రాలకు తరలించారు.
Also Read: Himachal Pradesh: జూనియర్‌ని ర్యాగింగ్ చేసిన సీనియర్లు అరెస్ట్
ఈ నేపథ్యంలో ఆ యా రాష్ట్రాల్లోని ఆ యా జిల్లాల్లో ఇటీవల కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్వయంగా పర్యటించారు. ముంపు ప్రాంతాల్లో సైతం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. అనంతరం తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులతో కేంద్ర మంతి చౌహాన్ భేటీ అయ్యారు. వరద నష్టంపై ఉన్నతాధికారులు కేంద్ర మంత్రికి నివేదిక అందజేశారు.
Also Read: Sonia Gandhi: సోనియా గాంధీ నివాసం వద్ద సిక్కు సంఘాలు ఆందోళన
మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో వరద సాయం కింద రూ. 3,300 కోట్ల తక్షణ సాయన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ సాయాన్ని వెంటనే విడుదల చేస్తున్నట్లు తెలిపింది. ఇంకోవైపు ఈ వరద విపత్తుపై తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ఉద్యోగ సంఘాలు సైతం స్పందించాయి. టాలీవుడ్ పరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు సైతం భారీగా ఆర్థిక సాయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.
Read More National News and Latest Telugu New