Share News

obscene videos scandal: ప్రజ్వల్ పాస్‌పోర్ట్‌ను రద్దు చేయండి... మోదీకి సిద్ధరామయ్య లేఖ

ABN , Publish Date - May 01 , 2024 | 09:22 PM

అసభ్యకర వీడియోల స్కాండల్ వ్యవహారం ముదురుతోంది. పలువురు మహిళలను లైంగికంగా వేధించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న హస్సన్ ఎంపీ ప్రజల్ రేవణ్ణ దౌత్య పాస్‌పోర్ట్ ను తక్షణం రద్దు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కోరారు. ఈ మేరకు ఒక లేఖ రాశారు.

obscene videos scandal: ప్రజ్వల్ పాస్‌పోర్ట్‌ను రద్దు చేయండి... మోదీకి సిద్ధరామయ్య లేఖ

బెంగళూరు: అసభ్యకర వీడియోల స్కాండల్ (obsecen videos scandal) వ్యవహారం ముదురుతోంది. పలువురు మహిళలను లైంగికంగా వేధించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న హస్సన్ ఎంపీ ప్రజల్ రేవణ్ణ (Prajwal Revanna) డిప్లమేటిక్ పాస్‌పోర్ట్ (Diplomatic passport)ను తక్షణం రద్దు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)ని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) కోరారు. ఈ మేరకు మోదీకి ఆయన లేఖ రాశారు.


''పోలీసు కేసు, అరెస్టు అనివార్యమని పసిగట్టినందునే నిందితుడు (రేవణ్ణ) ఏప్రిల్ 27వ తేదీనే దేశాన్ని విడిచి విదేశాలకు పారిపోయాడని వార్తలు వస్తున్నాయి. అది కూడా దౌత్యపరమైన పాస్‌పోర్ట్‌తో విదేశాలకు వెళ్లినట్టు తెలుస్తోంది. నిందితుడిపై ఉన్న నేరారోపణలపై విచారణకు సిట్ రేయింబవళ్లు పనిచేస్తోంది. ఆయనను దేశానికి వెనక్కి తీసుకురావడం చాలా కీలకం. తద్వారా దేశ చట్టాలకు అనుగుణంగా విచారణ జరపేందుకు వీలవుతుంది'' అని సిద్ధరామయ్య ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు.

Obsecene tapes scandal: ప్రజ్వల్ తొలి రియాక్షన్ ఇదే..


రేవణ్ణ విదేశాలకు వెళ్లేందుకు దౌత్య పాస్‌పోర్ట్‌ను వాడినందున వెంటనే దానిని రద్దు చేయాలని సిద్ధరామయ్య కోరారు. పరారీలో ఉన్న పార్లమెంటు సభ్యుడిని వెంటనే చట్టం ముందుకు తెచ్చేందుకు భారత ప్రభుత్వం అంతర్జాతీయ పోలీస్ ఎజెన్సీలతో పాటు, దౌత్య, పోలీసు పరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కూడా ప్రధానికి ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు.

Read Latest National News And Telugu News

Updated Date - May 01 , 2024 | 09:22 PM