Thunderstorm: ఇటెమో ఎండలు..అటెమో పిడుగుల వానతో ఆరుగురు మృతి
ABN , Publish Date - Mar 02 , 2024 | 08:28 AM
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కోడుతున్నాయి. కానీ దేశ రాజధాని ఢిల్లీ(delhi) సహా రాజస్థాన్(Rajasthan)లో మాత్రం వాతావరణం పూర్తిగా మారిపోయింది. పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు(Rains) మొదలయ్యాయి. ఈ క్రమంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పిడుగుపాటుకు ఆరుగురు మృతి చెందారు.
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కోడుతున్నాయి. కానీ దేశ రాజధాని ఢిల్లీ(delhi) సహా రాజస్థాన్(Rajasthan)లో మాత్రం వాతావరణం పూర్తిగా మారిపోయింది. పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు(Rains) మొదలయ్యాయి. దీంతో రాజస్థాన్‌లో వేర్వేరు ఘటనల్లో పిడుగుపాటుతో(Thunderstorm) ఆరుగురు మృతి చెందినట్లు అక్కడి అధికారులు తెలిపారు. అంతేకాదు వాతావరణ శాఖ ప్రకారం ఈ వర్షాల ప్రభావం మార్చి 2న కూడా ఉంటుందని తెలిపింది. దీంతో బికనీర్, జోధ్‌పూర్, అజ్మీర్, ఉదయ్‌పూర్, కోట, జైపూర్, భరత్‌పూర్ డివిజన్‌లలోని కొన్ని ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని ప్రజలను హెచ్చరించారు.
ఇక సవాయ్ మాధోపూర్ జిల్లాలో శుక్రవారం మధ్యాహ్నం ఆకస్మిక వర్షాల(rains) నేపథ్యంలో ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున నష్టం జరిగింది. మధ్యాహ్నం ప్రాంతంలో ఉరుములు, ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వర్షం కురిసింది. ఆ క్రమంలో పిడుగుపాటుకు జిల్లాలో ముగ్గురు మృతి చెందారు. అనేక గొర్రెలు(sheeps), మేకలు(goats) కూడా మరణానికి గురయ్యాయి. వడగళ్ల వాన కారణంగా గోధుమలు, ఆవాల పంటలు కూడా దెబ్బతిన్నాయి.
చౌత్‌కబర్‌వాడ తహసీల్‌లో పిడుగుపాటుకు(Thunderstorm) బాగిన గ్రామానికి చెందిన హర్భజన్ మీనా, జలేబీ భార్య రాజేంద్ర మీనా దంపతుల కుమారుడు రాజేంద్ర మీనా మృతి చెందారు. వీరిద్దరూ మేకలు మేపేందుకు పొలాలకు వెళ్లారు. వాటితో పాటు వారి మేకలు కూడా పిడుగుపాటుకు గురయ్యాయి. మిత్రపుర తహసీల్ పరిధిలోని నాంటోడి గ్రామంలోని అడవిలో గొర్రెలు మేపేందుకు వెళ్లిన గొర్రెల కాపరి ధన్నాలాల్ మీనా కూడా పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. వాటితో పాటు 100కు పైగా గొర్రెలు కూడా చనిపోయాయి. దౌసా జిల్లాలోని లాల్సోట్‌లో పిడుగుపాటుకు ఇద్దరు మృతి చెందారు. యువకుడు తన కుటుంబంతో కలిసి లాల్సోట్ నుంచి డియోలీ మోడ్‌కు కారులో వెళ్తున్న క్రమంలో పిడుగు పాటుకు గురయ్యారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Rameswaram Cafe Blast: సిద్ధరామయ్య ప్రభుత్వంపై బీజేపీ సంచలన వ్యాఖ్యలు